పలన్‌పూర్‌లో ఒక కస్టమర్ తన స్కూటర్‌ను షోరూమ్ వెలుపల తగలబెట్టాడు. స్టీరింగ్, టైర్ రైడ్ మధ్యలో తెగిపోవడంతో స్కూటర్ పనిచేయడంలేదని.. . తాను పదే పదే ఫిర్యాదు చేసినా సిబ్బంది స్పందించలేదని ఆరోపించాడు. దీంతో విసిగిపోయి షోరూమ్ బయటే బైక్ కు నిప్పంటించేశాడు. బైక్ నిమిషాల్లోనే కాలి బూడిదైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది
Read Also:Immigrants: 28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి
పూర్తి వివరాల్లోకి వెళితే.. స్కూటీ రిపేర్ కోసం వెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కస్టమర్ ఆ షోరూం ముందే దానికి నిప్పంటించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాలన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి షోరూంలో కొంతకాలం క్రితం ఓలా స్కటీని కొనుగోలు చేశాడు. కాగా అతడు తన భార్య, కుమారుడితో కలిసి స్కూటీపై షాపింగ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దాని హ్యాండిల్ రాడ్ విరిగిపోయింది. దీనివల్ల తాను, తన కుటుంబం ప్రమాదానికి గురయ్యామని వెల్లడించారు. దీంతో తాను కంపెనీకి అనేకసార్లు ఫిర్యాదు చేశానని.. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. స్కూటర్ తనకు “ఇకపై ఉపయోగం లేదు” అని చెప్పి దానిని తగలబెట్టాలని నిర్ణయించుకున్నానని అతను చెప్పాడు.
Read Also:Suicide:ఇద్దరు పిల్లలకి విషమిచ్చి.. ఆపై ఆపై ఆత్మహత్య చేసుకున్న తండ్రి
స్కూటీ రిపేర్ కోసం వెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో.. కస్టమర్ ఆ షోరూం ముందే దానికి నిప్పంటించాడు. వీడియోలో ఆ వ్యక్తి స్కూటర్‌పై కిరోసిన్ పోసి నిప్పంటించడాన్ని నిప్పంటించడంతో.. నిమిషాల్లోనే వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
షోరూమ్ ముందే ఓలా వాహనానికి నిప్పంటించిన కస్టమర్
స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని చెప్పినా కంపెనీ సిబ్బంది పట్టించుకోలేదని ఆగ్రహం
గుజరాత్–పాలన్‌పూర్ ప్రాంతంలో తన భార్య, కుమారుడితో కలిసి బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా తన ఓలా వాహనం స్టీరింగ్ రాడ్ విరిగిపోయిందని షోరూముకు… pic.twitter.com/JFyax4IzWd
— Telugu Scribe (@TeluguScribe) October 9, 2025
