Shanmukh Jaswanth | డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత టెలివిజన్ రియాలిటీ షోల్లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించిన షణ్ముఖ్ జస్వంత్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లతో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షణ్ముఖ్, బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొనడంతో మరింత ఫేమ్ సంపాదించాడు. ప్రస్తుతం హీరోగా సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయనతో పీకల్లోతు ప్రేమలో ఉన్న షణ్ముఖ్, బిగ్ బాస్ అనంతరం వ్యక్తిగత కారణాల వల్ల బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా మాట్లాడని షణ్ముఖ్, ఇటీవల ఓ యువతిని ప్రేమిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చాడు. అయితే ఆమె ముఖాన్ని వెల్లడించకుండా ఆసక్తి రేకెత్తించాడు.
ఇప్పుడు ఆ సస్పెన్స్‌కు తెరదిస్తూ వైష్ణవి చోడిశెట్టితో తన నిశ్చితార్థం జరిగినట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిశ్చితార్థ వేడుక సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సందడిగా జరిగింది. షణ్ముఖ్ షేర్ చేసిన వీడియోలో ఈ జంట ఎంతో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వైష్ణవిని ఎత్తుకుని తిప్పుతూ చేసిన డ్యాన్స్ స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుక మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగినట్టు వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
షణ్ముఖ్ జస్వంత్ – వైష్ణవి జంటకి అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్ చేస్తున్నారు. “హ్యాపీ ఎంగేజ్‌మెంట్ షన్ను”, “గాడ్ బ్లెస్ యూ బోత్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ నిశ్చితార్థ ఫొటోలు, వీడియోలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. డిజిటల్ స్టార్‌గా ప్రారంభమైన షణ్ముఖ్ ప్రయాణం ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తీసుకుంది. కెరీర్ పరంగా కూడా పలు ప్రాజెక్ట్‌లపై దృష్టి సారిస్తున్న ఈ యువ నటుడు, జీవిత భాగస్వామిగా వైష్ణవిని ఎంచుకోవడం అభిమానులను ఆనందానికి గురి చేసింది.
View this post on Instagram
A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
