శర్వానంద్ తనకు స్టార్డమ్ తీసుకొచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నాడు. ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మనమే సినిమాకి పెద్దగా గ్యాప్ తీసుకోకపోయినా ఆ నెక్స్ట్ సినిమా కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఎందుకంటే సాలిడ్ హిట్ కావాలనే టార్గెట్ తో ఆచితూచి సినిమాల ఎంపిక చేసుకున్నాడని సమాచారం. లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ‘బైకర్’ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమఅవుతోంది. బైకర్ ఒక స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో తెరకెక్కుతోంది. అభిలాష్ తెరకెక్కిస్తున్న బైకర్ లో శర్వానంద్ స్పోర్టీ అవతారం కొత్తగా కనపడబోతుంది.
ఇక మరో వైపు “నారి నారి నడుమ మురారి” రొమాంటిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్ యూత్‌కి నచ్చాయి. లవ్, కామెడీ, మ్యూజిక్ అన్నీ సెట్ అయినట్టు కనిపిస్తున్నాయి. శర్వానంద్‌కి ఈ రొమాంటిక్ జానర్ అనుకున్న సక్సెస్ ఇస్తుందనే హోప్‌లో ఉన్నాడు. ఇక సంపత్ నంది దర్శకత్వంలో వస్తోన్న “భోగి” పూర్తిగా మాస్ యాక్షన్ టోన్‌లో ఉంది. ఫైర్, రివెంజ్, ఎమోషన్ ఇవే ఈ టీజర్‌లో హైలైట్స్. హైదరాబాద్ శివార్లో 20 ఎకరాల్లో వేసిన సెట్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ ప్రశ్న ఏంటంటే ఈ మాస్ అవతారం ప్రేక్షకులకు నచ్చుతుందా, లేదా రిస్క్‌గా మారుతుందా అనే డౌట్ కూడా ఉంది. మూడు జానర్స్, డిఫరెంట్ స్టైల్స్, ఎమోషన్స్. ఇవన్నీ శర్వానంద్ కెరీర్‌లో కీలక టర్నింగ్ పాయింట్ అవబోతున్నాయి.మరి ఈ మూడింటిలో ఏది నిజంగా శర్వానంద్ కెరీర్‌కి బూస్ట్ ఇచ్చే సాలిడ్ హిట్ అవుతుందో చూడాలి.
