Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..

Ai generated article, credit to orginal website, February 15, 2026

Shivaratri Upavasam: మహా శివరాత్రి రోజున ప్రధానంగా చేసేవి రెండే రెండు ముఖ్యం. ఒకటి ఉపవాసం, రెండోది జాగరణ. ఈ రోజున శివ భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరణ చేస్తుంటారు. మీరు కూడా ఈ రోజు ఈ రెండూ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం పదండి..
Read Also: Maha Shivaratri 2026: శివనామ స్మరణతో తరిద్దాం.. మహాశివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలో తెలుసా?
ఉపవాసం మీనింగ్:
ఉపవాసం అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే ఏం తినకుండా ఉండడం అని.. కానీ అసలు ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట.. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. పూజ చేసే సమయంలో ఏ దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే.. శివునికి అతి దగ్గరగా ఉండాలి.. జ్ఞానేంద్రియాలను ఆ పరమ శివుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయడం బెటర్. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ఇక, ఉపవాసం అంటే ఏం తినకూడదని చెప్తుంటారు.. అంటే నోటి ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు పేర్కొంటున్నారు. కానీ, ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పొద్దు.. అది అశనమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలా అన్నారని.. ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట.. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపుకు మంచి రిలేషన్ ఉంటుంది.. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్​ తప్పుతాయి.. కాబట్టి అల్పంగా చేయడం బెటర్.
Read Also:Couple Friendly: ప్రభాస్ మెచ్చిన ప్రేమకథ.. సంతోష్ శోభన్ మూవీపై డార్లింగ్ ప్రశంసలు!
సాత్వికమైన ఆహారమే..
ఆహారం అనేది మానవ శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట.. సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసించకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. తక్కువ మోతాదులో తీసుకుని ఉపవాసం చేయవచ్చని వెల్లడిస్తున్నారు.
ఉపవాసం అలా చేయకూడదు..
ఏం తినకుండా కూర్చోవటం.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆహారాన్ని నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటున్నారు. చాలామంది డ్యూటీలకి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతర పనులకు దగ్గరగా ఉంటారు. అలాగే, జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉంటుంది కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం.. జాగరణే కాదంటున్నారు. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేయడం మంచింది.
నిజమైన ఉపవాసం ఇదే..
మధుమేహం ఉన్నవారు సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది దీక్ష భంగమైనట్లు కాదు.. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడు.. అది ఉపవాసం భంగంలోకి రాదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటారో ఆ భగవంతుని సేవల్లో కూడా అంతే ఉండటమే నిజమైన ఉపవాసమని పండితులు చెప్తున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • రూ. 37.12 కోట్ల విలువైన భూముల‌ను కాపాడిన హైడ్రా
  • గ్రూప్ -1 నియామకాల అవ‌క‌త‌వ‌క‌లపై సిట్ ఏర్పాటు
  • సంజు శాంస‌న్ అద్భుత‌మైన ఆట‌గాడు : గంగూలీ
  • ఏపీ బ‌డ్జెట్ లో వ్య‌వ‌సాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు
  • ఆంధ్రప్రదేశ్‌ను ప‌ర్యాట‌క‌ గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes