Shriya Reddy : శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా షూటింగ్ కు ముందు రోజూ తాను ఏం చేసేదో బయట పెట్టింది. ఇందుకు సంబంధించిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో ఎప్పటి నుంచో నటించాలనే తన కల సలార్ తో తీరిపోయిందని తెలిపింది.
Read Also : Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
అయితే సలార్ సినిమాలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. అంత మంది మగవారి మధ్య నేను హైలెట్ కావడం కోసం ప్రతి రోజూ షూట్ కు ముందు 50 పుష్ అప్స్ తీసేదాన్ని. అలా పుష్ అప్స్ చేయడం నాకు చాలా ఈజీగా అనిపించేది. అలా చేయడం వల్లే సినిమాలో నేను హైలెట్ కాగలిగాను. నా పాత్ర అంత బాగా ఎలివేట్ అయింది. ప్రభాస్ లాంటి బాడీ ఉన్న హీరోతో స్క్రీన్ లో మనం కనిపించాలి అంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ నవ్వేసింది శ్రియారెడ్డి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రియారెడ్డికి ఇప్పుడు మళ్లీ వరుస ఛాన్సులు వస్తున్నాయి. త్వరలోనే మరో రెండు సినిమాల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Rashmika : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేయడంపై స్పందించిన రష్మిక
