Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

Ai generated article, credit to orginal website, March 14, 2026

Telangana SSC Exams: తెలంగాణలో నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మరో కొన్ని గంటల్లో పరీక్షా కేంద్రలు తెరుచుకోనున్నాయి. సరిగ్గా 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష సమాయం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్‌కు హాజరుకానున్నారు. 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 13 వరకు, ఒకేషనల్ విద్యార్థులకు ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి. ఈ సమయంలో విద్యార్థులు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ముందుగా సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ఐదు నిమిషాలు లేట్ అయినా ఎంట్రీ చేస్తారు. కానీ.. 30 నిమిషాల ముందే వెళితే బెటర్. ఇక పెన్నులు, కావాల్సిన సామగ్రితోపాటు హాల్‌టికెట్టు అస్సలు మర్చిపోవద్దు. ఈ పరీక్షలు ముగిసే వరకు హాల్‌టికెట్ భద్రంగా ఉంచుకోండి. పరీక్షా హాలులో ఇచ్చే ఓఎంఆర్ షీట్, జవాబు పత్రంపై విద్యార్థుల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
READ MORE: Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..
ఎక్కడా తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నింపాలి. ఓఎంఆర్‌లో కొట్టివేతలు, వైట్‌నర్ వంటివి వాడేందుకు వీలుండదు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే ప్రశాంతంగా అన్ని ప్రశ్నలను ఒకసారి చదువుకోవాలి. బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయడం ఉత్తమం. ఇక విద్యార్థులు పరీక్షా సమయంలో ఒత్తిడిలో ఉంటారు. పేరెంట్స్ పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాలి. ఈ ఎగ్జామ్స్ ముగిసే వరకు పనులు చెప్పకపోవడం మంచిది. వాళ్లకు చదువు కునేందుకు అనువైన వాతావరణం ఇంట్లో ఉండాలి. ఇతర పిల్లలతో పోల్చకూడదు. ఎవరి టాలెంట్ వాళ్లదని చెబుతూ పోత్సహించాలి. భయపెట్టడం, వార్నింగ్‌లు ఇవ్వడం వంటివి చేయొద్దు. ధైర్యం మాత్రం చెప్పండి. ఫలితాలు ఎలా ఉన్నా పర్వాలేదు ముందు ప్రయత్నించమని విశ్వాసాన్ని పెంపొందించండి.
READ MORE: Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • హైడ్రా ప‌నితీరుకు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు ఫిదా
  • వేద విద్యార్థుల సంఖ్య‌ను పెంచేందుకు కృషి చేయాలి
  • ప్ర‌జా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ప్రభుత్వం లక్ష్యం
  • సంప‌న్న‌మైన ఎమ్మెల్యేల‌లో చంద్ర‌బాబు, డీకే శివ‌కుమార్
  • టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణలు రావాలి

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes