టాలీవుడ్‌లో స్టిల్ బ్యాచ్‌లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్‌లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్‌తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు అనుష్క. 43 ఏజ్‌లోకి అడుగుపెట్టినా కెరీర్‌పై ఫోకస్ తప్ప వెడ్డింగ్ బెల్స్ ఎప్పుడూ మోగుతాయో చెప్పడం లేదు ఈ స్టార్ హీరోయిన్.
Also Read : Andhra Pradhesh : ఏపీలో సినిమా థియేటర్స్ క్లోజ్.. కారణం ఏంటంటే?
ఇక శృతి హాసన్ పెళ్లి సంగతి పక్కన పెడితే వరుస లవ్ ఫెయిల్యూర్స్ ఆమెను మ్యారేజ్ గురించి ఆలోచించకుండా చేశాయి. అంజలి కూడా ఇంకొకరిని జీవితంలోకి ఆహ్వానించేంత తీరిక, ఓపిక తనకు లేదంటోంది మన తెలుగుమ్మాయి. మిల్క్ బ్యూటీ తమన్నా ఇంకా సింగిల్ లైఫే లీడ్ చేస్తోంది. విజయ్ వర్మతో బ్రేకప్ వల్ల లవ్ అండ్ మ్యారేజ్ జోలికి వెళ్లకుండా ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తుంది. ఇక నిత్యా మీనన్ పెళ్లి చేసుకునే ధ్యాస కానీ, ఉద్దేశం కానీ లేదు. పొడుగుకాళ్ల సుందరి పూజా హేగ్డే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. రీసెంట్లీ 20 ఇయర్స్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న రెజీనా కసాండ్రా కూడా సోలో లైఫ్ సో బెటర్ అంటోంది. అందం రాశులు పోసినట్లుగా ఉండే రాశీ ఖన్నా 35 లోకి ఎంటర్ కాబోతోంది. పెళ్లి గురించి మాత్రం పెదవి విప్పడం లేదు. ఇక వీళ్ల వెనుక వచ్చిన సాయి పల్లవి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలన్న ఆలోచన ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే 30 ప్లస్‌లోకి ఎంటరౌతున్న భామలు.. ఎప్పుడు పప్పన్నం పెడతారు అంటే అప్పుడే మాకేం వయస్సైపోయిందని అంటారేమో..?
