Taliban: భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్యసమితి అనుమతి పొందిన తర్వాత, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారత పర్యటనకు వస్తున్నారు. ఆంక్షల జాబితాలో ఉన్న ముత్తాకీకి, భారత పర్యటన కోసం యూఎన్ అనుమతి ఇచ్చింది. 2021లో ఆఫ్ఘాన్‌లో తాలిబాన్‌లు అధికారం చేపట్టిన తర్వాత, ఓ తాలిబాన్ మంత్రి భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. భారత, తాలిబాన్ అధికారులు పలుమార్లు యూఏఈ వేదికగా చర్చించారు. ఆఫ్ఘాన్‌కు మానవతా సాయం కింద భారత్ సాయపడుతూనే ఉంది.
ముత్తాకీ తన పర్యటనలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(EAM), జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్‌లను కలిసే అవకాశం ఉంది.ఈ సమావేశాన్ని అన్ని దేశాలు ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా, పాకిస్తాన్ ఈ పర్యటనపై భయంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్‌కు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. పాక్ తాలిబాన్లు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో పాక్ ఆర్మీ, పోలీసులు టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులకు ఆఫ్ఘాన్‌లోని తాలిబాన్లు సహకరిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఇప్పటికే, పాకిస్తాన్-ఆఫ్ఘాన్ మధ్య డ్యూరాండ్ లైన్ వివాదం కొనసాగుతోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ విదేశీ సైన్యం కూడా మోహరించే చర్యను రష్యా, చైనా, భారత్ సహా ఏడు దేశాలు వ్యతిరేకించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కాబూల్‌లోని బగ్రామ్ ఏయిర్‌బేస్‌ని ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Virender Sehwag Wife: షాకింగ్.. బీసీసీఐ అధ్యక్షుడితో సెహ్వాగ్ సతీమణి డేటింగ్?
జెండాపై పంచాయతీ:
అయితే, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి పర్యటన ఇప్పుడు కొత్త సందిగ్ధతకు కారణమవుతోంది. రెండు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల సమయంలో ఇరు దేశాల జెండాలు నాయకులు వెనకాల లేదా టేబుల్‌పై ఉంచాలి. కానీ ఇప్పటి వరకు భారత్ తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబాన్ జెండాకు అధికార హోదాను ఇవ్వలేదు. ఇప్పటి వరకు న్యూఢిల్లీలో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయంలో తాలిబాన్లు తమ జెండాను ఎగరవేయడానికి అనుమతించలేదు. ఈ జెండాపై ఇస్లామిక్ విశ్వాసానికి సంబంధించిన పదాలు ఉంటాయి. తాలిబాన్ల కన్నా ముందు ఉన్న ఆఫ్ఘన్ జెండా మాత్రమే రాయబార కార్యాలయంలో ఉంది.
భారత అధికారులు, ముత్తాకి మధ్య గతంలో జరిగిన సమావేశాల్లో తాలిబాన్ జెండాను ఉపయోగించారు. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్‌లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, ముత్తాకీ మధ్య జరిగిన సమావేశంలో రెండు దేశాల జెండాలు లేకుండానే సమావేశం జరిగింది.
