సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన వరుసగా సూపర్ హిట్లు అందుకుని, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఆమె బాలీవుడ్‌లో కూడా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. గ్లామర్, గ్రేస్‌తో పాటు తెలివైన ఆలోచనలతోను అభిమానులను ఆకట్టుకునే తమన్నా, తాజాగా బంధాలు, ప్రేమ, జీవిత భాగస్వామి గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Jatdhara: ఫిజికల్‌గా .. నా కెరీర్‌లో ఇది అత్యంత కష్టమైన పాత్ర..
ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “ప్రేమలో ఉన్నప్పుడు అబద్ధం చెప్పడం నాకు అస్సలు నచ్చదు. నా మనిషి తప్పు చేస్తే నేను అర్థం చేసుకుంటాను, సమస్య వస్తే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. వారు ఎంత పెద్ద పొరపాటు చేసినా నేను నీకు అండగా ఉంటాను, కానీ అబద్ధం చెబితే మాత్రం అస్సలు సహించను. అది నాకు అసహ్యంగా అనిపిస్తుంది” అని స్పష్టంగా చెప్పారు. అదే విధంగా కొంతమంది తన ముఖం మీదే అబద్ధం చెబుతారని ,అబద్ధం చెప్పిన వారు నన్ను తెలివితక్కువగా భావించడం వల్ల కోపం మరింత ఎక్కువ వస్తుంది అని తెలిపింది. అలాగే
తన భవిష్యత్ జీవిత భాగస్వామి గురించి మాట్లాడుతూ .. “నేను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారాలని కోరుకుంటున్నాను. నా భర్తకు నేను అదృష్టంగా అనిపించేలా ఉండాలి.  నేను జీవితంలో వస్తే, ఆయనకు ఇది గత జన్మలో చేసిన మంచి కర్మల ఫలితం అనిపించాలి. ముఖ్యంగా నా భర్త విషయంలో నిజాయితీగా ఉంటా. గొడవలు అవుతాయి అని తెలిసిన కూడా నిజాలే మాట్లాడుతా అబద్ధాలు కాదు. నేను ఆ స్థాయికి చేరడానికి ప్రయత్నిస్తున్నాను. ప్యాకేజీ త్వరలో వస్తుంది” అంటూ నవ్వుతూ చెప్పింది. ఇక ఈ వ్యాఖ్యలతో తమన్నా బంధంలో నిజాయితీకి ఎంత విలువ ఇస్తుందో స్పష్టమవుతోంది.
