Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Team India: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్‌ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్

Ai generated article, credit to orginal website, February 11, 2026

Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన పాక్ ఎట్టకేలకు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్‌కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందే అభిషేక్‌కు ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు.
READ MORE: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు!
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో మాట్లాడారు. “అభిషేక్‌కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు ఉన్నాయి. రెండు రోజుల్లో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే హ్యాండ్‌షేక్స్‌కు సైతం అభిషేక్ రాకపోవడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజులల్లో పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ ఉంది. అప్పట్లోగా అభిషేక్ కోలుకుంటాడా? ఈ మ్యాచ్‌ ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలిసినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టులో చేరాడు. “సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఇవాళ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు,” అని తెలిపారు.
READ MORE: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • క్రీడ‌లు, రాజ‌కీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ
  • ఎట్ట‌కేల‌కు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
  • సంక్షేమ వ‌స‌తి గృహాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న
  • చంద్ర‌బాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?
  • వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes