Telangana: తెలంగాణలో మొక్కజొన్న రైతులకు శుభవార్త. మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం రైతుల్లో ఆనందాన్ని నింపింది. మొక్కజొన్న పంట సేకరణ అంశంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రైతుల సమస్యలను వివరించి, మద్దతు ధరకు కొనుగోళ్లను ప్రారంభించాలని సూచించారు.
Shubman Gill: రోహిత్ కెప్టెన్సీకి ఎండ్ కార్డు పడుతుందని ముందే తెలుసు.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది కూడా కేంద్రం సహకారం లేకుండానే సుమారు ₹160 కోట్ల వ్యయంతో మొక్కజొన్న, జొన్న పంటలను మద్ధతు ధరకు సేకరించింది. రైతులను నష్టాల నుండి రక్షించేందుకు ఇదే విధానాన్ని ఈసారి కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. PSS (Price Support Scheme) కింద పెసర, మినుము, సోయా చిక్కుడు, కంది, వేరుశనగ వంటి పంటలను సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం 25% సీలింగ్ విధించింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆ పరిమితిని మించి పంటల సేకరణ కొనసాగిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మరోసారి కోరింది.. కేవలం మద్ధతు ధర ప్రకటించి వదిలేయడం కాకుండా, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలుకు రాష్ట్రానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, మిగతా పంటలపై ఉన్న 25% సీలింగ్‌ను పూర్తిగా ఎత్తివేయాలని కూడా రాష్ట్రం కోరింది. రైతుల ఆదాయాన్ని రక్షించడానికి, పంటలకు న్యాయమైన ధరలు లభించేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల తెలిపారు.
Immigrants: 28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి
