Telangana BJP : బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఇద్దరు ప్రముఖ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొని వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్ లకు ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. మంచిర్యాలలో రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు పాల్పడినట్లు పార్టీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. క్రమశిక్షణ కమిటీ ఆదేశాల ప్రకారం.. మూడు రోజుల్లోపే సంజాయిషీ సమర్పించాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది పార్టీ లోపల క్రమశిక్షణ, నియమాలను రక్షించేందుకు తీసుకున్న చర్యగా పేర్కొన్నారు.
Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..
