Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

Ai generated article, credit to orginal website, November 26, 2025

 
 
తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సెప్టెంబర్ 29వ తేదీన అనౌన్స్ చేసిన షెడ్యూల్‌ను కొన్ని కారణాల వల్ల నిలిపివేశాము. ఈ రోజు నుంచి ఎంసీసీ కోడ్ అమలులోకి వస్తుందన్నారు.
 
అబ్జర్వల్‌లు, ఎలక్షన్ అబ్జర్వల్‌లను నియమించాం. 31 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11,14,17 తేదీల్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు పోలింగ్ రోజే ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. నవంబర్ 27వ తేదీ నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30వ తేదీ నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు’ అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్‌ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు.
 
‘‘సెప్టెంబర్‌ 29న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్‌ 9న షెడ్యూల్‌పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,236 సర్పంచ్‌ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని తెలిపారు. గురువారం (నవంబర్‌ 27) నుంచి తొలి విడత పోలింగ్‌కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్‌ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్‌ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 
సర్పంచ్‌ ఎన్నికలకు బంపరాఫర్‌ ప్రకటించిన బండి సంజయ్‌
 
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రిలీజ్‌ నేపథ్యంలో కరీంనగర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్‌ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన. మాట ఇస్తే… తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్‌ఎస్‌ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్‌ రిలీజ్‌ చేసింది. షెడ్యూల్‌ రిలీజ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్‌ రాణి కుముదిని దేవి మీడియా ముఖంగా వెల్లడించారు.
 
The post TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నారావారి ప‌ల్లెలో చంద్ర‌బాబు ఫ్యామిలీ సంద‌డి
  • రెండు వేర్వేరు కేసుల‌పై పై సిట్ ఏర్పాటు
  • వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి
  • స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ స్కాంలో చంద్ర‌బాబుకు క్లీన్ చిట్
  • చైనా మాంజా ఉప‌యోగిస్తే జైలుకే : స‌జ్జ‌నార్

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes