Tirumala : తిరుమల శ్రీవారి పరకామణి చోరీకి సంబంధించి సీఐడీ బృందం విచారణ చేపట్టింది. హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విచారణను మొదలుపెట్టింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. శ్రీవారి ఆలయ పరకామణిని సీఐడీ బృందం పరిశీలించింది. దీనిపై కేసు నమోదైన తిరుమల వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లోనూ రికార్డులను పరిశీలించారు.
2023 మార్చిలో శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీ జరిగింది. 920 డాలర్లు చోరీ చేస్తూ తితిదే ఉద్యోగి రవికుమార్ పట్టుబడ్డాడు. ఈ ఘటనపై టీటీడీ (Tirumala) పూర్తిస్థాయి విచారణ నిర్వహించలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లోక్ అదాలత్‌తో రాజీ కుదుర్చుకుని అప్పటి పాలకవర్గం కేసు మూసివేయించదని ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు విచారణను సీఐడీ ప్రారంభించింది.
Tirumala – ఈ నెల 17 నుండి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరులో కొలువు తీరిన శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ బ్రహ్మోత్సవాలు నవంబర్ 25వ తేదీతో ముగుస్తాయని తెలిపింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది. ఈ సందర్భంగా అమ్మవారి వాహన సేవలను ఏ రోజున ఏమిటనే విషయాన్ని ఈ సందర్భంగా వివరించింది. ఈ మేరకు టీటీడీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
వాహన సేవల వివరాలు :
17-11-2025 (సోమవారం) ధ్వజారోహణం (ధనుర్ లగ్నం) ఉదయం, చిన్నశేషవాహనం ( రాత్రి).
18-11-2025 (మంగళవారం) పెద్ద శేషవాహనం (ఉదయం), హంసవాహనం (రాత్రి).
19-11-2025 (బుధవారం) ముత్యపు పందిరి వాహనం (ఉదయం), సింహవాహనం (రాత్రి)
20 -11-2025 (గురువారం) కల్పవృక్ష వాహనం (ఉదయం), హనుమంత వాహనం (రాత్రి)
21 -11-2025 (శుక్ర వారం) పల్లకీ ఉత్సవం (ఉదయం), గజవాహనం (రాత్రి)
22-11-2025 (శనివారం) సర్వభూపాలవాహనం (ఉదయం), స్వర్ణరథం (సాయంత్రం), గరుడవాహనం (రాత్రి)
23-11-2025(ఆదివారం) సూర్యప్రభ వాహనం (ఉదయం), చంద్రప్రభ వాహనం (రాత్రి)
24-11-2025 (సోమవారం) రథోత్సవం (ఉదయం), అశ్వ వాహనం (రాత్రి)
25-11-2025 (మంగళవారం) పంచమీతీర్థం (ఉదయం), ధ్వజావరోహణం (రాత్రి).
Also Read : Google: విశాఖలో గూగుల్ డేటాసెంటర్
The post Tirumala: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ ప్రారంభం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
