రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. అక్రమ సంబంధాల మోజులో కట్టుకున్న వారిని కడతేర్చడమో.. లేకపోతే వేరే వాళ్లతో వెళ్లిపోవడమో చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ లో చోటుచేసుకుంది. ఓ న్యాయవాది భార్య తన పిల్లలని తీసుకుని ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనతో అతడు మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
పూర్తివివరాల్లోకి వెళితే.. కమల్ కుమార్ సాగర్ అనే వ్యక్తి మూడు నెలల క్రితం తన భార్య తన ప్రియుడితో పారిపోయినప్పటి నుండి నిరాశలో ఉన్నాడు. ఆ ప్రేమికుడు అతడిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు. కమల్ ఒక సూసైడ్ నోట్ రాసి, “నా భార్య మా ఇద్దరు అమాయక పిల్లలను వదిలి తన ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఆమె మూడు నెలలుగా అతనితో నివసిస్తోంది మరియు నన్ను తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరిస్తూనే ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కమల్ సాగర్‌కు కోమలితో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొద్ది రోజులుగా కోమలి షామ్లీ నివాసి అయిన విశాల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. షామ్లీ నివాసి అయిన విశాల్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతోంది. ఉన్నట్లుండి ఇద్దరు పిల్లలను తీసుకుని అతనితో పారిపోయింది. ఈ విషయం తెలిసిన భర్త.. మానసికంగా కుంగిపోయాడు. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య, ఆమె ప్రియుడు తన చావుకు బాధ్యులని సూసైడ్ నోట్‌లో పేర్కొన్న కమల్.. తన ఇద్దరు పిల్లలను తల్లికి అప్పగించకూడదని కోరాడు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు..మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
