TTD : టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ (AP) హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన వారిలో దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, లీగల్ సర్వీసెస్ అథారిటి మెంబర్ సెక్రటరీ, తిరుపతి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, సీఐడీడీజీ, టీటీడీ (TTD) ఈవో, సీవీఎస్‌ఓ, తిరుపతి వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్ఓ, పరకామణి అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్, నిందితుడు పీవీ రవికుమార్ ఉన్నారు. అయితే తదుపరి విచారణని నవంబరు 17వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. పరకామణి చోరీ కేసులో లోక్ అదాలత్ ఇచ్చిన ఉత్తర్వుల చట్టబద్ధతను తేల్చే వ్యవహారాన్ని న్యాయమూర్తులు జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ సుభేందులకు చీఫ్ జస్టిస్ అప్పగించారు. పరకామణి చోరీ కేసుపై రాజీ, ఇతర అంశాలపై తాను ఇచ్చిన ఉత్తర్వులను సీజే ముందు ఉంచాలని గతంలో సింగిల్ జడ్జ్ ఆదేశించిన విషయం తెలిసిందే.
TTD – కర్నూలు బస్సు ప్రమాదం అసత్య ప్రచారం కేసులో 27 మందిపై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ (AP) కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకురు గ్రామ సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి బస్సు దగ్దమైంది. ఈ ప్రమాదంపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు అందడంతో కర్నూలు తాలుకా అర్భన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ జాబితాలో ఆరే శ్యామల, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణతోపాటు వైసీపీ అధికార ఎక్స్ పేజీ నిర్వాహకులు ఉన్నారు.
ఈ కర్నూలు బస్సు ప్రమాదం బెల్టు షాపులు, కల్తీ మద్యం కారణంగానే జరిగిందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఆ క్రమంలో కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున చిన్నటేకురు వద్ద జరిగిన ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ క్రమంలో ప్రమాదం జరిగిన సమీపంలోని సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు.
ఈ ప్రమాదానికి మద్యం తాగిన బైక్ నడిపిన శివశంకర్ అనే వ్యక్తి కారణమని తేల్చారు. అదే బైక్‌పై ప్రయాణించిన అతడి స్నేహితుడు ఎర్రి స్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాను కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందన్నాడు. తనను డోన్‌లో దింపుతానని శివశంకర్ చెప్పాడంతో అతడి బైక్ ఎక్కానన్నాడు.
అనంతరం ఇద్దరం మద్యం తాగి… శివశంకర్ తనను బైక్‌పై డోన్‌లో దింపేందుకు బయలుదేరాడని తెలిపాడు. అలా వెళ్తున్న క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను బైక్ ఢీకొట్టిందని.. శివశంకర్ అక్కడకక్కడే మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనలో తనకు స్వల్పంగా గాయాలయ్యాయని పేర్కొన్నారు. అంతలో రహదారిపై ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీశానని చెప్పుకొచ్చాడు. రహదారిపై ఉన్న బైక్‌ను తీసే క్రమంలో పలు బస్సులు వేగంగా వెళ్లాయని పోలీసులకు చెప్పాడు. అంతలో కావేరీ ట్రావెల్స్ బస్సు… ఈ బైక్‌ను ఈడ్చుకుని ముందుకు వెళ్లిందని… ఆ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసుకు ఎర్రి స్వామి వివరించాడు. అయితే పెట్రోల్ బంక్‌లో శివశంకర్ తన బైక్‌కు ఆయిల్ కొట్టించిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు విడుదల చేశారు. అయితే బెల్ట్ షాపులో విక్రయించిన కల్తీ మద్యం వీరు తాగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ వైసీపీ ఒక విధమైన ప్రచారానికి తెర తీసింది. దీంతో వెనుములయ్య పోలీసులను ఆశ్రయించాడు.
Also Read : Justice Suryakant: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్
The post TTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
