ప్రసిద్ధ టెలివిజన్ యాంకర్ శివ జ్యోతి, ఆమె తమ్ముడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, శివ జ్యోతి కుటుంబాన్ని తీవ్రంగా విమర్శిస్తూ పెద్దఎత్తున భక్తులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన టిటిడి, శివ జ్యోతి ఆధార్ కార్డు ను బ్లాక్ చేస్తూ, భవిష్యత్తులో ఆమె శ్రీవారి దర్శనం చేసుకోకుండా నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ఇటీవల సోషల్ మీడియాలో శివ జ్యోతి తమ్ముడు చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. తిరుమల ప్రసాదం—లడ్డూ నాణ్యత, ధర, నిర్వహణ పై వ్యతిరేక వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతినాయని టిటిడి అభిప్రాయపడింది. దీనితో టీటీడీ విజిలెన్స్ విభాగం వెంటనే దర్యాప్తు ప్రారంభించి, కుటుంబాన్ని నేరుగా పరిశీలించింది. దర్యాప్తు అనంతరం, టీటీడీ ట్రస్ట్ బోర్డు అత్యవసరంగా సమావేశమై శివ జ్యోతి ఆధార్‌ను బ్లాక్ చేయాలని నిర్ణయించింది. దీంతో శివ జ్యోతి ప్రస్తుతం ఈ-దర్శనం, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం వంటి ఏ రకమైన దర్శనానికీ అనుమతి పొందలేని పరిస్థితి ఏర్పడింది.
వివాదం తీవ్రత పెరుగుతుండటంతో, శివ జ్యోతి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “నా తమ్ముడు చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా హృదయపూర్వక క్షమాపణలు. మా కుటుంబం ఎప్పటికీ శ్రీవారి భక్తులే. ఉద్దేశపూర్వకంగా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు,” అని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె క్షమాపణ తర్వాత కూడా భక్తుల ఆగ్రహం తగ్గకపోవడంతో, టీటీడీ తన నిర్ణయాన్ని కొనసాగించింది. తిరుమలలో శ్రీవారి ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం సముచితమని చాలా మంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం కఠిన నిర్ణయం పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఏదేమైన భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దేవస్థానం, శ్రీవారి ప్రసాదం, సెవలు లేదా ఆలయ విధానాలపై అవమానకర వ్యాఖ్యలు చేస్తే ఎవరినైనా నిబంధనల ప్రకారం శిక్షించబడుతారని టీటీడీ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. .
