అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. టేనస్సీ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. 19 మంది చనిపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సైనిక, అంతరిక్ష, వాణిజ్య పరిశ్రమలకు పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. ఇక పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కంపించాయి. దీంతో ప్రజలంతా హడలెత్తిపోయారు. ఏం జరిగిందో అర్థం కాక భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: France: 4 రోజుల క్రితం రాజీనామా.. మళ్లీ ప్రధానిగా లెకోర్ను నియామకం
హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ మాట్లాడుతూ.. ఇది వినాశకరమైన పేలుడుగా అభివర్ణించారు. ఉదయం పూట ఈ ఘటన జరిగినట్లుగా తెలిపారు. చాలా మంది ఆచూకీ తెలియడం లేదని.. ప్రస్తుతం కొంత మంది వ్యక్తులు మాత్రమే సజీవంగా ఉన్నారని చెప్పారు. మిగతా వారంతా చనిపోయి ఉంటారని తెలిపారు. శుక్రవారం ఉదయం 7:45 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇక ప్రమాదం తర్వాత భవనం శిథిలావస్థకు చేరుకుంది. అంటే ప్రమాదం ఏ స్థాయిలో జరిగి ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇక ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Theft: పెన్షన్ మంజూరు అయ్యిందని.. ఫొటో దించాలని వృద్ధురాలిని నమ్మించి.. మూడు తులాల పుస్తెలతాడు చోరీ
  BREAKING: HORRIFIC EXPLOSION LEVELS TENNESSEE BOMB FACTORY
A massive blast ripped through a munitions plant near Bucksnort, Tennessee, early Friday morning, leaving 19 workers missing and feared dead.
The explosion hit the Accurate Energetic Systems (AES) facility just… pic.twitter.com/Gh9SVduq8a
— Mario Nawfal (@MarioNawfal) October 10, 2025
