Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

US-Iran: ఇరాన్-అమెరికా మధ్య ప్రధాన డిమాండ్లు ఇవే! చర్చలు కొలిక్కి వచ్చేనా?

Ai generated article, credit to orginal website, April 11, 2026

ఇస్లామాబాద్‌ వేదికగా ఇవాళ అమెరికా-ఇరాన్ మధ్య కీలక సమావేశం జరగబోతుంది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో ఇరాన్ నుంచి ఆరుగురు, అమెరికా నుంచి నలుగురు, పాకిస్థాన్ నుంచి నలుగురు బృందం చర్చల్లో పాల్గొనున్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
డిమాండ్లు ఇవే..
లెబనాన్‌పై దాడులు ఆపేయాలని.. అలాగే అమెరికా స్తంభింపజేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తుండగా.. యురేనీయం శుద్ధిని ఆపేయాలని.. అలాగే హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. హార్ముజ్‌ను అడ్డం పెట్టుకుని ప్రపంచ దేశాల నుంచి డబ్బు వసూలు చేయడాన్ని అమెరికా తప్పుపడుతోంది.

ఇరాన్ నుంచి..
ఇరాన్‌కు చెందిన ఆరుగురు ప్రముఖులు చర్చల్లో పాల్గొననున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ చర్చలకు నేతృత్వం వహించనున్నారు. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్ సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యదర్శి అలీ అక్బర్ అహ్మదీన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సీనియర్ దౌత్యవేత్త మజీద్ తఖ్త్ రవాంచి , భద్రతా నిపుణుడు మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ కూడా ఈ చర్చల్లో భాగమవుతారని ఇరాన్ పేర్కొంది.
ఇక ఇరాన్ ప్రతినిధి బృందానికి ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. ఇటీవల అమెరికా దాడుల్లో 168 మంది పాఠశాల విద్యార్థులు చనిపోయారు. దీంతో ‘మినాబ్ 168’ అని పేరు పెట్టారు. మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ పాకిస్థాన్‌కు చేరుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫొటోను పంచుకున్నారు. ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 168 మంది చిన్నారులు మరణించిన ఘటనకు గుర్తుగా విమానంలోని ఫొటోను పంచుకున్నారు. పిల్లలకు నివాళులర్పిస్తూ… అంతర్జాతీయ వేదికపై ఆ ఘటనను గుర్తుచేసుకుంది.

అమెరికా నుంచి.
ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు నలుగురు ప్రముఖ అమెరికా వ్యక్తులు ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ చర్చలకు నాయకత్వం వహిస్తున్నారు. ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారు జారెడ్ కుష్నర్, మధ్యప్రాచ్య ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ కూడా ఈ శాంతి చర్చలకు హాజరవుతున్నారు.
పాకిస్థాన్ నుంచి
శాంతి చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నందున పలువురు కీలక అధికారులు పాల్గొననున్నారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, జాతీయ భద్రతా సలహాదారు మహమ్మద్ అసిమ్ మాలిక్ ఈ చర్చల్లో పాల్గొననున్నారు.
ట్రంప్ వార్నింగ్..
ఇదిలా ఉంటే చర్చలకు ముందు ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే భీకర దాడులు ఉంటాయని.. ఇరాన్ చుట్టూ అమెరికా నౌకలు శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఒప్పందమా? దాడులా? అన్నది 24 గంటల్లో తేలిపోతుందని ట్రంప్ పేర్కొన్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పారిశ్రామిక కేంద్రంగా జ‌గ్గ‌య్య‌పేట : కేశినేని నాని
  • రేవంత్ రెడ్డి నిర్వాకం ఆర్ఎస్పీ ఆగ్ర‌హం
  • శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్
  • పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ
  • తెలంగాణ స‌ర్కార్ పై హైకోర్టు సీరియ‌స్

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes