Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

US Plane Crash | అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

Ai generated article, credit to orginal website, November 5, 2025

US Plane Crash | అమెరికాలోని లూయిస్‌విల్లేలో విమాన ప్రమాదం జరిగింది. మహమ్మద్‌ అలీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన యూపీఎస్‌ కార్గో విమానం.. టేకాఫ్‌ సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది మృతిచెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 5.15 గంటలకు (తెల్లవారుజామున 3.45 గంటలకు) ఈ ప్రమాదం జరిగింది.
కూలిపోయిన విమానం మెక్‌డోనల్డ్స్‌ డగ్లస్‌ ఎండీ-11 మోడల్‌గా గుర్తించారు. లూయిస్‌విల్లే నుంచి హవాయికి బయల్దేరిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదాన్ని ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ఏఏ) ధ్రువీకరించింది. ఇప్పటివరకు ముగ్గురు సిబ్బంది మృతి చెందగా..11 మంది గాయపడ్డారని కెంటకీ గవర్నర్‌ ఆండీ బేషియర్‌ తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా, విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. విమానం టేకాఫ్‌ అవుతున్న సమయంలో ఎడమ ఇంజిన్‌లో నుంచి మంటలు వచ్చినట్లుగా కనిపించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి విమానం కుప్పకూలింది. విమానం కూలడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లుగా నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు చేపట్టింది.
 

New footage about UPS cargo plane crash near Louisville, Kentucky airport showing the fire during take-off. pic.twitter.com/p93xAw6qa4
— aircraftmaintenancengineer (@airmainengineer) November 4, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • NIA: ‘ఎన్‌ఐఏ’కు దిల్లీ పేలుడు కేసు
  • Amit Shah: దిల్లీ పేలుళ్ళ వెనుక ఉన్న ప్రతి ఒక్కర్ని వేటాడతాం – అమిత్‌ షా
  • Bihar Exit Polls: బిహార్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ లో ఎన్డీయేకే తిరిగి పట్టం
  • Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో వెలుగులోకి సంచలన విషయాలు
  • Terrorists: ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రవాదుల పనే!

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes