Uttar Pradesh : సమస్యలపై ప్రజల నుంచి వినతుల స్వీకారానికి నిర్వహించే ‘సమాధాన్ దివస్’ (ప్రజా ఫిర్యాదుల దినం)లో ఓ వ్యక్తి నుంచి వచ్చిన అర్జీ చూసి యూపీలోని (Uttar Pradesh) సీతాపుర్ కలెక్టర్ నివ్వెరపోయారు. తన భార్య నసీమున్ రాత్రిపూట నాగినిగా మారిపోయి బుస కొడుతోందని, బెదిరిస్తోందని మహమూదాబాద్ తహసీల్‌లోని లోధాసా గ్రామానికి చెందిన మెరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో సహాయం కోసం కలెక్టర్ వరకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. దీనితో ఈ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.
Uttar Pradesh Viral Updates
‘రాత్రయితే చాలు.. నా భార్య ’నాగిని’లా మారిపోతోంది. స్.. స్. అంటూ బుసలు కొడుతోంది.. నాట్యం చేస్తోంది.. భయపెడుతోంది.. నాకు నిద్ర కరువయ్యింది.. ఆమెతో కలిసి పడుకోలేక పోతున్నా!’.. ఇదీ మీరాజ్ చెప్పిన సారాంశం. అది విని.. కలెక్టర్ సహా అక్కడున్న అధికారులందరికీ నోట మాట రాలేదు. ‘మా ఆవిడ నసీమున్కికి మతిస్థిమితం లేదు. రాత్రి కాగానే ఆవిడ నాగినిలా మారిపోతోంది. ఆవిడ నాట్యం, బుసలు, స్… స్… అంటూ చేసే అల్లరితో నా గుండె జారిపోతోంది!’.. అని మీరాజ్ బావురు మన్నాడు. పోలీసుల దగ్గరకు వెళ్తే ‘ఇది మీ భార్యాభర్తల వ్యవహారం.. మీరే తేల్చుకోండి’.. అనడంతో కలెక్టర్ కార్యాలయానికి వచ్చానని వాపోయాడు. అతను చెప్పింది విన్న కలెక్టర్ మొదట అవాక్కయినా… తర్వాత తేరుకుని.. ‘ఏం జరిగిందో విచారణ జరపండి.. తగిన చర్య తీసుకోండి’.. అని పోలీసులకు ఆదేశాలిచ్చారట. ‘ఫిర్యాదు అందింది, దర్యాప్తు జరుగుతోంది’.. అని పోలీసులు వెల్లడించారు. ఇప్పుడు ఆ ’నాగిని’ని పట్టుకోవాలా?, లేక ఆమెకి కౌన్సెలింగ్ ఇవ్వాలా? అని పోలీసులు తల బాదుకుంటున్నారు.
Also Read : Anakapalli SP: జగన్ మాకవరపాలెం పర్యటనకు ఓకే ! రోడ్ షోకు నో పర్మిషన్ !
The post Uttar Pradesh: నాగిని చేష్టలతో భర్తను హడలెత్తిస్తున్న భార్య ! appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
