వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad) కులకచర్లలో (Kualakacharla) దారుణం చోటుచేసుకుంది. భార్య పిల్లలతోసహా వదినను కత్తితో నరికి చంపేశాడు. కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య, అలివేలు (35) దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అలివేలు, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లడానికి యాదయ్య వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. వారంతా నిద్రలో ఉండగా భార్య అలివేలు, కూతురు అపర్ణ (13), హన్మమ్మ (40)ను కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
పెద్ద కూతురిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె తల, చేతికి గాయాలతో తప్పించుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
