Virosh | టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ-రష్మిక మంధాన వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారు. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం (ఫిబ్రవరి 24) ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన కొన్ని సరదా ఫోటోలను పంచుకున్నారు. రష్మిక షేర్ చేసిన ఒక ఫోటోలో ‘Virosh Premier League’ అని రాసి ఉన్న గ్రౌండ్ కనిపించింది. ఆ ఫన్ గేమ్స్ కోసం బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హాజరైనట్టు తెలుస్తోంది.
అదే సమయంలో విజయ్ కూడా ‘విరోష్ ప్రీమియర్ లీగ్’ అనే పేరుతో ఉన్న పాప్‌కార్న్ బకెట్ ఫోటోను షేర్ చేశాడు. చిన్న చిన్న గ్లింప్స్‌తోనే ఈ వేడుకలు ఎంత ఉత్సాహంగా సాగుతున్నాయో అర్థమవుతోంది. ఇక పూల్‌సైడ్ గ్యాదరింగ్, స్విమ్మింగ్ పూల్‌లో వాలీబాల్ ఆటలు, అందమైన డిన్నర్ సెటప్‌లతో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఎంతో ప్రైవేట్‌గా, హాయిగా జరుగుతున్నాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 22) రష్మిక, విజయ్ తమ పెళ్లిని అధికారికంగా ప్రకటించారు. అభిమానులు ప్రేమగా పిలిచే ‘విరోష్’ అనే పేరునే తమ వివాహానికి శీర్షికగా పెట్టుకుంటున్నట్టు వెల్లడించారు. “మా కోసం మేము ఏ పేరు ఎంచుకోవాలని అనుకునేలోపే మీరు మాకు ‘విరోష్’ అనే అందమైన పేరు పెట్టారు. కాబట్టి మా పెళ్లికి ‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం” అంటూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. 2018లో వచ్చిన గీతా గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన తర్వాత నుంచే వీరి మధ్య ప్రేమ ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు గాసిప్‌లుగానే ఉన్న ఆ వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరగనుంది. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ‘విరోష్’ పెళ్లి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందరి చూపు ఫిబ్రవరి 26పైే ఉంది. టాలీవుడ్‌లో మరో స్టార్ జంట కొత్త జీవితం ప్రారంభించబోతుండటంతో సినీ వర్గాల్లో ఆనంద వాతావరణం నెలకొంది.
