Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు

Ai generated article, credit to orginal website, October 19, 2025

మేషం
వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సఫలం అవుతాయి. స్థిరచరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
వృషభం
పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. బంధువులు, స్నేహితుల సహకారంతో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలన అవకాశం. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.
మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పై అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారులు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా, అలసట లేకుండా పనులపై మనసు నిలుపుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. శివారాధన శుభప్రదం.
సింహం
బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. కార్య సాఫల్యం ఉంది. భూ లావాదేవీలు కలిసివస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమయానుకూల నిర్ణయాలతో పనులు చక్కబెడతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
కన్య
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూల వారం. మంచి సంస్థలలో అవకాశాలు వస్తాయి. స్నేహితులు, బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. వ్యాపార విస్తరణ పనులు వాయిదా వేసుకోవడం మంచిది. విహారయాత్రలు, తీర్థయాత్రలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఇంట్లోకి కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
తుల
ఇంటా, బయటా అనుకూల వాతావరణం. రావలసిన డబ్బు ఆలస్యంగా అందినప్పటికీ అనుకున్న పనులు నెరవేరుతాయి. వ్యాపార లావాదేవీలు సానుకూలంగా ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలు కొంతవరకు కొనసాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. శివారాధన శుభప్రదం.
వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబసభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు తోటివారితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
ధనుస్సు
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టడం అవసరం. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామాలయాన్ని సందర్శించండి.
మకరం
ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఉంటుంది. బరువు, బాధ్యతలు పెరిగినా.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నా, ఆఖరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన వల్ల మేలు కలుగుతుంది.
కుంభం
ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. అధికారుల ఒత్తిడి అధికమవుతుంది. వారాంతంలో శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మీనం
వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. అలసట లేకుండా పట్టుదలతో పనులు చేస్తారు. అనవసరమైన ఆలోచనలను పక్కనపెట్టి, కార్యనిర్వహణపై మనసు నిలపండి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్‌ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌. సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • తీయ‌ని మాట‌లు కాదు నిలువునా దోచేసే సైబ‌ర్ కేటుగాళ్లు
  • అక్రమ కేసులపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
  • గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం స‌ర్కార్ కు రోడ్ మ్యాప్
  • జ‌ర్నీలో విజ‌యాల కంటే ఎదురు దెబ్బ‌లే ఎక్కువ‌
  • ఇమామ్, మౌజ‌న్ల‌కు ఏపీ స‌ర్కార్ భారీ తోఫా

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes