Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Woman Doctor | ప్రభుత్వాన్ని విమర్శించిందని.. 65 ఏండ్ల మహిళా డాక్టర్‌కు 30 ఏండ్ల జైలు శిక్ష

Ai generated article, credit to orginal website, November 18, 2025

Venezuela: వెనెజులాలోని నికోలస్‌ మదురో (Nicolas Maduro) ప్రభుత్వాన్ని విమర్శించిన ఓ మహిళా డాక్టర్‌కు (Woman Doctor) కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మార్గీ ఒరోజ్కో (Marggie Orozco) అనే 65 ఏండ్ల మహిళా డాక్టర్‌ వాట్సప్‌ ఆడియో మెసేజ్‌ (WhatsApp Audio Message) ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశం పంపించిందని ఆమెపై కమ్యూనిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు రాజద్రోహం, విద్వేషాన్ని ప్రేరేపించడం, కుట్రకు పాల్పడిందంటూ కోర్టు జీవిత కాల శిక్ష విధించింది. అయితే ఆమె ఏ సందేశం పంపారు, ఎవరికి పంపారనే విషయం తెలియలేదు.
2024 జూలైలో వెనెజులా (Venezuela) అధ్యక్షుడిగా నికోలస్‌ మదులో మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఫలితాలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్‌ ఒరోజ్కోను (Marggie Orozco) ఆగస్టు నెలలో శాన్‌ జువాన్‌ డి కోలన్‌ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని అరెస్టు చేశారు. అయితే చాలా మంది నెలల వ్యవధిలో విడుదలయ్యారు. అయితే ఒరోజ్కో మాత్రం జైలులోనే మగ్గిపోయారు. తాజాగా ఆమెప నమోదైన అభియోగాలను నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, ఒరోజ్కో నిర్బంధంలో ఉండగా ఒరోజ్కోకు రెండు సార్లు గుండెపోటు వచ్చిందని జేఈపీ అనే హక్కుల ఎన్జీవో వెల్లడించింది. దేశంలోని జైళ్లలో సుమారు 882 మంది రాజకీయ ఖైదీలు మగ్గిపోతున్నారని తెలిపింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు
  • అధికారంలోకి వ‌స్తాం ఇబ్బంది పెట్టిన వాళ్ల‌ను వ‌ద‌లం
  • స‌జ్జ‌నార్ కు విచారించే నైతిక అర్హ‌త లేదు
  • 3 ఎక‌రాల‌ను ఆక్ర‌మించిన‌ న‌ల్ల మ‌ల్లారెడ్డి

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes