యాదాద్రి భువనగిరి : మహాశివరాత్రి(Mahasivaratri) సందర్భంగా యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ క్షేత్రం శ్రీ పర్వత వర్ధనీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. పరమశివుడు, స్పటిక లింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.
యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం వీరభద్ర స్వామి ఆలయంలో శివుని, కొలనుపాకలో చండికాంబ సహిత సోమేశ్వర ని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా పలు శివాలయాల్లో శివుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాత్రి జాగరానికి సన్నాహాలు చేస్తున్నారు.
