YS Jagan: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణను “కుట్ర”గా వర్ణించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం ద్వారా వారిని అన్యాయానికి లోనుచేస్తారని జగన్ ఆరోపించారు.
Funny Groom: అందరి ముందు పరువు పోయిందిగా.. చిన్న పటాక్ పేలితేనే భయపడ్డ వరుడు.. పగలబడి నవ్విన బంధువులు
తమ పాలనలో ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయబడిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం వల్ల పేదవారికి వైద్యం అందించడం అసాధ్యమవుతుందని, అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి తెచ్చినట్లని పేర్కొన్నారు. నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టడం, కోవిడ్ సంక్షోభంలో రూ.500 కోట్లు ఖర్చు చేసి, ఈ మెడికల్ కాలేజీ పూర్తయిన తర్వాత 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందించనున్నట్టు జగన్ అన్నారు.
Dharmapuri Arvind : సీఎం రేవంత్ రెడ్డిపై ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు
అయితే, ప్రైవేట్ పరంగా మార్చడం వల్ల పేదవారికి వైద్యం ఎలా అందుతుందన్న ప్రశ్నను జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 17 మెడికల్ కాలేజీలలో ఏడు కాలేజీలు పూర్తయ్యాయని.. అందులో 5 కాలేజీలలో 2023-24 సీట్లతో క్లాసులు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. విజయనగరం, పాడేరు మెడికల్ కాలేజీల క్లాసులు కూడా మొదలైనట్లు జగన్ పేర్కొన్నారు. ఐతే అమరావతిలో లక్ష ఎకరాల భూమి, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్, నీళ్లు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నా, మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు (ఒక సంవత్సరం వెయ్యి కోట్లు) ఖర్చు చేయలేదని, వాటిని ప్రైవేట్ పరంగా మార్చడం పేదవారికి అన్యాయం చేస్తున్నదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఆధునిక మెడికల్ కాలేజీలు పేదలకు ఉచిత వైద్యం, మెడిసిన్ చదవడానికి అవకాశాలు అందించే దేవాలయాలు, వాటిని ప్రైవేట్ పరంగా మారుస్తూ రాజకీయ లాభాల కోసం వినియోగించడం తట్టుకోలేమని ఆయన అన్నారు.
