లక్నో : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయొంట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠను రేపింది. చివరి వరకు నువ్వా నేనా అన్న రీతిలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తిని రేపింది. ఇరు జట్ల స్కోర్ సమం కావడం మరింత టెన్షన్ రేపింది. కేకేఆర్ 155 పరుగులు చేసింది నిర్ణీత 20 ఓవర్లలో. అనంతరం లోక్నో సైతం 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. అంపైర్లు సూపర్ ఓవర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేవలం ఒకే ఒక్క పరుగు చేసింది లక్నో. అనంతరం రింకూ సింగ్ ఫోర్ కొట్టి కోల్ కతా జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మోహిసిన్ ఖాన్ కోల్ కతా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే బంతులతో ఇబ్బంది పెట్టాడు. దీంతో తన బౌలింగ్ లో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. తను 4 ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. పేస్ దెబ్బకు విల విల లాడారు. కనీసం 100 పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రింకూ సింగ్ మాత్రం అడ్డుగోడలా నిలబడ్డాడు. తను 51 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 5 సిక్సులతో విరుచుకుపడ్డాడు. తను 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో 7 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది.
The post ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ విక్టరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
