హైదరాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అఖిల్ అక్కినేని, అందాల ముద్దుగుమ్మ భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన లెనిన్ చిత్రంపైనే ఉన్నాయి. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీకి సంబంధించి న్యూ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ వెంటనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది యెట్ట యెట్టా సాంగ్. ఈ పాటకు పోటీపడి నటించారు అఖిల్, బోర్సేలు. హిట్ సాంగ్స్ కేటగిరీలోకి చేరి పోయింది ఈ పాట. ఈ ప్రధాన జంట సినిమా షూటింగ్ సమయంలో ఎంతగానో సందడి చేశారని అర్థమవుతోంది. చిత్ర నిర్మాతలు ఈ సినిమా నుండి రెండవ పాట అయిన యెట్ట యెట్టాను విడుదల చేశారు .
ఈ పాట ప్రధానంగా ఈ జంట మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీపైనే ఆధారపడి విజయవంతమైంది. ఒక సహజమైన, గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉన్న ఈ ఆకట్టుకునే పాటలో, భాగ్యశ్రీ ఉల్లాసభరితమైన అందం, అఖిల్ యొక్క మాస్ డాన్స్ స్టెప్స్కు చక్కటి జోడిలా నిలిచింది.తమన్ స్వరపరిచిన ఈ ఉత్సాహ భరితమైన డాన్స్ నంబర్, ఆకట్టుకునే బీట్స్, ఉరకలేసే శక్తితో నిండి ఉంది, ఇది పాటను మరింత ఆసక్తికరంగా మార్చేలా చేసింది. ఇక లెనిన్ లోని మొదటి పాట వారేవా వారేవా కూడా బిగ్ హిట్ గా నిలిచింది. మురళి కిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే.
The post దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
