Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు

Ai generated article, credit to orginal website, May 8, 2026

హైద‌రాబాద్ : టాలీవుడ్‌లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అయితే ఈ సారి ద‌ర్శ‌కునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M చిత్రం మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సౌత్ ఇండియా లో PVR Inox Pictures, నార్త్ ఇండియా లో JVEL, ఓవర్సీస్ Tekflix ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు.
అమెరికాలో సీరియల్ కిల్లర్స్ కాన్సెప్ట్ చాలా ఫేమస్. “వాట్ ఈజ్ ద మోటివ్ బిహైండ్ దిస్ మర్డర్?” అని ఆలోచించినప్పుడు, “మోటివ్ ఫర్ మర్డర్” (Motive for Murder) అని ఫిక్స్ అయ్యాం. దానికి షార్ట్ కట్ గానే “M4M” అని టైటిల్ పెట్టాం. ప్రతి సీన్ ని ఒక చిన్న సినిమా లాగా అంత కేర్ తీసుకొని చేశాను. స్క్రీన్ ప్లే చాలా జాగ్రత్తగా రాసుకున్నాను. చాలా ఫుటేజ్ ఉన్నా, దాన్ని క్రిస్ప్ గా ఎడిట్ చేసి హాలీవుడ్ స్టైల్ లో కేవలం 90 నిమిషాల సినిమాగా రెడీ చేశాం. ఇంటర్వెల్ కూడా అవసరం లేదు, కానీ మన వాళ్ళకి అలవాటు కాబట్టి ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ పెట్టాం. ఒక క్లైమాక్స్ సీన్ లో మమ్మీ లాగా కట్టేసే సీన్ ఒకటి హాఫ్ డే పట్టింది, అది కొంచెం ఛాలెంజింగ్ గా అనిపించింది.
హానెస్ట్ గా చెప్పాలంటే సినిమా రిలీజ్ కొద్దిగా డిలే అయింది. దీనికి కారణం కొద్దిగా రీషూట్ చేయాల్సి రావడం. దానికి తోడు భాను మాస్టర్ తో ఒక ప్రోమో సాంగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఒకసారి షూట్ చేసి స్క్రాప్ చేశాం, మళ్ళీ ఇంకోటి షూట్ చేసి స్క్రాప్ చేసి, థర్డ్ టైం భాను మాస్టర్ తో ఫైనల్ చేశాం. సారథి స్టూడియోస్ లో కంటిన్యూస్ గా మూడున్న‌ర‌ రోజులు షూట్ చేశాం. ముందు ఓటీటీ వాళ్ళని కూడా ట్రై చేశాం, కానీ పిక్చర్ రిలీజ్ తర్వాత వర్కవుట్ చేద్దామని OTT వాళ్లు అన్నారు. ఇలా ఫస్ట్ ఒక షేప్ కి వచ్చేసింది.
Who is the Killer సాంగ్ ఫస్ట్ టైం సాంగ్ చేసినప్పుడు నేను అంతగా శాటిస్ఫై కాలేదు. తర్వాత ఒక మంచి కొరియోగ్రాఫర్ తో చేద్దామని మనసులో పడి, ట్రెండింగ్ లో ఉన్న భాను మాస్టర్ తో చేద్దామని నిర్ణయించుకున్నాం. దానికి తోడు సింగర్ నోయల్ తో ఒక ర్యాప్ కూడా పాడించాం. అది చాలా బాగా వచ్చింది. దాదాపు మూడున్న‌ర‌ రోజులు, అందులో నైట్ షిఫ్ట్ కూడా చేశాం. 10 డిఫరెంట్ సెటప్స్ వేశాం. భాను మాస్టర్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాలేదు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. ఫైనల్ గా సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అవును, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ చాలా వాటికి పంపించాం. మాక్సిమం ఒక 25-30 అవార్డ్స్ వచ్చాయి, కానీ IMDB రికగ్నైజ్ చేసినవి 15 అవార్డ్స్. ఇందులో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ మ్యూజిక్ కి అవార్డ్స్ వచ్చాయి.
కాన్స్ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత, ఇండియాలో ఇఫీ (IFFI) గోవాలో కూడా ప్రీమియర్ వేశాం. ఈ సినిమా ఇండియాలో 8వ తేదీన విడుద‌లైతే, 7వ తేదీన అమెరికాలో రిలీజ్ చేస్తున్నాం. ఎవరైతే సీరియల్ కిల్లర్ ని కనుక్కుంటారో వాళ్లకి లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తాం. అమెరికాలో తెలుగు వాళ్ల‌కు ఎవరో ఒకరు ఇంటి వాళ్లుగానీ, తెలిసిన వాళ్లుగానీ ఉంటారు కాబట్టి కిల్లర్ ఎవరనేది ఈజీగా లీక్ చేస్తారు కదా అని కొందరు అన్నారు. కానీ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నాను. సినిమాను జాగ్రత్తగా చూసి కిల్లర్ ఎవరో చెప్తే లక్ష రూపాయలు టేబుల్ మీద పెట్టి ఇస్తాను.
ఎందుకంటే ఈ కథను నేను చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తో రాసుకున్నాను. కిల్లర్ ఎవరో అనే సస్పెన్స్ సినిమా చివరి వరకు ప్రేక్షకులను వెంటాడుతుంది. అందుకే ఎవరైనా కిల్లర్ పేరు చెప్పినా, వారు పూర్తి కథను గెస్ చేయలేరని నా నమ్మకం. ప్రస్తుతం ఆడియన్స్ ట్రెండ్ మారుతోంది. హాలీవుడ్ స్టైల్ లో అనవసరమైన సీన్లు లేకుండా కథను వేగంగా నడిపించడమే నా ఉద్దేశ్యం. అందుకే దాదాపు 3 గంటల ఫుటేజ్ ఉన్నా, ఎడిటింగ్ లో చాలా వరకు తీసేసి కేవలం 90 నిమిషాల గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా దీనిని మలిచాం.
అమెరికాలోని తెలుగు ఆడియన్స్ కోసం ప్రత్యేకంగా ప్రీమియర్స్ ప్లాన్ చేశాం. అలాగే ఈ సీరియల్ కిల్లర్ ఛాలెంజ్ (లక్ష రూపాయల రివార్డ్) అనేది అక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. అక్కడి ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు సినిమా చూసి కిల్లర్ ఎవరో లీక్ చేస్తారేమో అన్న భయం ఉన్నా, ఆ ట్విస్ట్ అంత ఈజీగా దొరకదని నేను భావిస్తున్నాను. నేను హాలీవుడ్ లో టామ్ హాంక్స్ లాంటి వాళ్ళ వర్క్ ని ఫాలో అవుతుంటాను. నేను నిర్మించిన సినిమాలకు ఒకదానికొకటి సంబంధం ఉండదు. ‘మల్లెపూవు’లో భూమికతో కొత్త కుర్రాడిని పరిచయం చేశాం. ‘మెంటల్ కృష్ణ’ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేశాం. బడ్జెట్ విషయంలో ఎప్పుడూ రిస్క్ తీసుకున్నాను. ఈ ‘M4M’ కూడా ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మర్డర్ మిస్టరీగా, ఫుల్ ఆఫ్ ట్విస్టులతో తీశాం.
ఎప్పుడూ కొత్త వాళ్లకి అవకాశం ఇద్దామనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో సెర్చ్ చేశాం. చెన్నైకి చెందిన ఒక అబ్బాయి దొరికాడు. లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుందేమో అనుకున్నాను, కానీ మ్యూజిక్ కి లాంగ్వేజ్ బారియర్ ఉండదు కదా. స్టోరీ చెప్పగానే చాలా అద్భుతంగా చేశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి దాదాపు 5-6 అవార్డ్స్ వచ్చాయి. నా ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్లకే అవకాశాలు ఇస్తాను. నేను ఎప్పుడూ పర్సంటేజ్ సిస్టమ్ కే మద్దతు ఇస్తాను. 98% ప్రొడ్యూసర్స్ దీనికి అంగీకరించారు. ఇప్పుడు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఓటీటీల వల్ల ఆడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గింది. కాబట్టి ప్రొడ్యూసర్స్, థియేటర్ ఓనర్స్ పర్సంటేజ్ విధానం పాటిస్తే అందరికీ లాభదాయకం. ఇదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్స్ లో కూడా చెప్పాను.
The post రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఘ‌నంగా శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు
  • ఏపీని దేశానికి ఆద‌ర్శ ప్రాయంగా మార్చాలి
  • రిలీజ్‌కు ముందే 15 ఇంట‌ర్నేష‌న‌ల్ అవార్డులు
  • ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ : సీఎం
  • కీల‌క సంస్క‌ర‌ణ‌లు విద్యా రంగంలో పెను మార్పులు

Recent Comments

No comments to show.

Archives

  • May 2026
  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes