పుదుచ్చేరి : ముఖ్యమంత్రిగా రంగస్వామి సంచలనం సృష్టించారు. ఆయన వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి పీఠం అధీష్టించనున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలలో మెజారిటీ సాధించడంతో ఆయన మరోసారి కొలువు తీరేందుకు మార్గం సుగమమైంది. ఆయనకు ప్రజల నుంచి భారీ మద్దతు ఉంది. తనను జనం సీఎంగా పిలుచుకుంటారు అక్కడి వారంతా. ఇది ఆయన స్పెషాలిటీ. ఎన్నో మార్పులు వచ్చినా చివరకు తననే వారు ఏరికోరి గెలిపిస్తూ వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు. ప్రజా సేవలోనే ఉన్నారు. ఇంకా కొనసాగుతూ వస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. 1991లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయ్యారు. తర్వాత పదేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి 2011లో ఏఐఆర్సీని స్థాపించారు. 2016లో ఓడినా తర్వాతి ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. తాజాగా 30 సీట్లకు గాను బీజేపీ ఏఐఆర్సీ కూటమి మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. మరోసారి అధికారాన్ని చేజిక్కించు కునేందుకు సిద్దమైంది. ఇక సీఎంగా రికార్డ్ సృష్టించిన రంగస్వామి పూర్తి పేరు నటరాజన్ రంగస్వామి. ఆయన 1950లో పుట్టారు. జన్మ స్థలం పుదుచ్చేరి. లా చదివారు. 2001 నుంచి 2008 వరకు సీఎంగా కొనసాగారు. ఆ సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందారు . తర్వాత పార్టీతో విభేదాల కారణంగా బయటకు వచ్చారు. 2011లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ అనే పేరుతో కొత్త పార్టీ పెట్టారు. అదే ఏడాది ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ ముఖ్యమంత్రిగా అయ్యారు. రెండో దఫా లో 2011 నుంచి 2016 , మూడో దఫా 2021 నుంచి 2026 వరకు సీఎంగా ఉన్నారు.
The post 75 ఏళ్ల రంగస్వామి సీఎంగా ఐదోసారి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
