మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అభిమానులు, సినీ ప్రముఖుల శుభాకాంక్షల మధ్య ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ రమేష్‌తో పాటు గబ్బర్ సింగ్ టీమ్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకంగా కేక్ కట్ చేసి మెగాస్టార్ పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ టీమ్ మెగా కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. గబ్బర్ సింగ్ రమేష్ ప్రస్తుతం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి మెగా కుటుంబం అందించిన అండ, సహకారం ఎంతో కీలకమైందని పేర్కొంది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మెగా ఫ్యామిలీ చేసిన సహాయాన్ని జీవితాంతం మరచిపోలేమని తెలిపింది.
అలాగే చిరంజీవి చూపిన ప్రేమ, ఆప్యాయత తమకు ఎప్పటికీ గుర్తుండిపోతాయని గబ్బర్ సింగ్ టీమ్ పేర్కొంది. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరెన్నో సంవత్సరాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించింది.

మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో గబ్బర్ సింగ్ టీమ్ పాల్గొనడం, మెగా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
The post చిరంజీవి బర్త్‌డే వేడుకల్లో గబ్బర్ సింగ్ టీమ్.. రమేష్‌పై మెగా ఫ్యామిలీ అండకు కృతజ్ఞతలు appeared first on TeluguBulletin.com.