Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Indian Railways: విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు

Ai generated article, credit to orginal website, December 6, 2025

దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు రోజులుగా విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో నరకయాతన పడుతున్నారు. ప్రయాణాలు ముందుకు సాగక కటిక నేలపైనే నిద్రపోయారు. ఇలా అన్ని ఎయిర్‌పోర్టులోనూ వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కూడా పరిస్థితులు చక్కబడలేదు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తం అయింది.
ఇది కూడా చదవండి: Trump: ఎట్టకేలకు ట్రంప్‌కు అవార్డు.. ‘ఫిఫా శాంతి బహుమతి’ ప్రకటన
విమాన ప్రయాణికులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. దేశ వ్యాప్తంగా 114 అదనపు ట్రిప్పులను నడుపుతోంది. అంతేకాకుండా 37 రైళ్లకు 116 అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసింది. సబర్మతి-ఢిల్లీ మధ్య ప్రత్యేక రైలు నడుస్తుందని ప్రకటించింది. అదనపు కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: నగరంలో అర్ధ రాత్రి నుంచి ‘ఆపరేషన్ కవచ్’.. గల్లీల్లోకి 5వేల మంది పోలీసులు..
అహ్మదాబాద్-ఢిల్లీ మార్గంలో ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ పథకం కింద సబర్మతి నుంచి ఢిల్లీకి సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఛార్జీలతో తక్షణమే ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. రైలు నెంబర్ 09497/09498 సబర్మతి-ఢిల్లీ సూపర్‌ఫాస్ట్ నాలుగు ట్రిప్పులు తిరగనుంది. ఈ రైలు డిసెంబర్ 7-9 తేదీల్లో 10:55 గంటలకు సబర్మతి నుంచి బయల్దేరి మరుసటి రోజు 3:15 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. ఇలా ఆ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
 

Indian Railways, in view of the surge in passenger demand following widespread flight cancellations, has taken extensive measures to ensure smooth travel and adequate availability of accommodation across the network. A total of 37 trains have been augmented with 116 additional… pic.twitter.com/ovDFWqG0VR
— ANI (@ANI) December 5, 2025

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • లోకేష్ యువ గ‌ళం పాద‌యాత్ర‌కు మూడేళ్లు
  • జ‌న‌సేన ఎమ్మెల్యే వ్య‌వ‌హారంపై సమగ్ర విచార‌ణ
  • పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం
  • శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
  • స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes