పనాజీ: ఉత్తర గోవాలో (Goa) ఘోర అగ్ని ప్రమాదం (Fire Acciden) జరిగింది. అర్పోరా గ్రామంలో ఉన్న బిర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్‌లో (Night Club) అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడంతో (Cylinder Blast) మంటలు చెలరేగాయి. దీంతో 23 మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పర్యటకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. మిగతా వారంతా క్లబ్ సిబ్బందిగా గుర్తించారు.
ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద ఘటనపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్లబ్ నడిచేందుకు అనుమతిచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతుల్లో ముగ్గురు సజీవదహనమవగా, 20 మంది ఊపిరాడక చనిపోయారని చెప్పారు. క్లబ్‌లో భద్రతా నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని వెల్లడించారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎమ్మెల్యే లోబో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని నైట్ క్లబ్‌లపై తనిఖీలు నిర్వహిస్తామన్నారు. అనుమతులు లేని క్లబ్ లైసెన్స్‌లు రద్దుచేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. కాగా, ప్రమాదం జరిగిన నైట్‌క్లబ్ రాజధాని పనాజీకి 25 కి.మీ దూరంలో ఉంది. గతేడాది దీన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
बड़ी खबर
गोवा में धमाके से आग लगने पर 23 लोगों की मौत।
उत्तरी गोवा में स्थित अर्पोरा गांव के एक नाइटक्लब में सिलिंडर ब्लास्ट से भीषण आग लग गई, जिसमें कम से कम 23 लोगों की मौत हो गई। pic.twitter.com/7R76b3o50E
— INC TV (@INC_Television) December 6, 2025
