హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బుధవారం కన్నుమూశారు.వయో సంబంధిత సమస్యలతో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కర రావు వయసు 90 సంవత్సరాలు. కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు , అభిమానులు అంతిమ నివాళులు అర్పించు కోవడానికి వీలుగా, ఆయన పార్థివ దేహాన్ని జూబిలీహిల్స్ లోని వారి స్వగృహం నందు ఉంచనున్నారు.
హైదరాబాద్ లోని పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో తన అంత్యక్రియలు నిర్వహించాలని నాదెండ్ల భాస్కర రావు కుటుంబ సభ్యులకు సూచించారు. ఆయన ఆకాంక్ష మేరకు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, మాజీ సీఎం వైఎస్ జగగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దే దేవుడిని ప్రార్థించారు. ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఆనాడు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించారు. కొద్ది రోజుల పాటు సీఎం గా ఉన్నారు. ఆ తర్వాత తన సర్కార్ ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లారు. తిరిగి అఖండ మెజారిటీతో పవర్ లోకి వచ్చారు.
The post మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
