గుజరాత్ : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 కీలక లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ బిగ్ షాక్ ఇచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టుకు ఇది మూడో ఓటమి కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ఆర్సీబీ. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులే చేసింది. అనంతరం స్వల్ప టార్గెట్ ను సునాయసంగా పూర్తి చేసింది. 15.4 ఓవర్లలో పని పూర్తి కానిచ్చేసింది. శుభ్ మన్ గిల్ కేవలం 18 బంతులు మాత్రమే ఆడి 43 రన్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ 19 బంతులు ఆడి 39 పరుగులు చేశాడు. ఇందులో 2 ఫోర్లు 4 భారీ సిక్సులు ఉన్నాయయి.
అంతకు ముందు మైదానంలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆశించిన మేర రాణించలేక పోయారు. 19.2 ఓవర్లలోనే 155 పరుగులకే చాప చుట్టేశారు. దేవదత్ పడిక్కల్ 24 బంతులు ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 13 బాల్స్ ఆడడి 28 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఇక గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అర్షద్ 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు కూల్చాడు. హోల్డర్ 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.ఇక భువీ తొలి ఓవర్లోనే 4, 6తో వేట మొదలెట్టిన గిల్.. హాజిల్‌వుడ్ రెండో ఓవర్లో అయితే విశ్వరూపం చూపించాడు. 4, 4, 6, 4, 6తో ఆ ఓవర్లో 24 రన్స్ పిండుకున్నాడు
The post బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ బిగ్ షాక్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
