హైదరాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. శ్రీజన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె వలస కార్మికుల పిల్లల కోసం వినూత్న పథకం రూపొందించారు. ఇంటి వద్దకే చదువు చెప్పించేలా చేశారు. ఇందు కోసం కార్యక్షేత్ర పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడారు. తాము విలాసవంతమైన సౌకర్యాలు కల్పించ లేకపోయినా, ప్రతి బిడ్డకు సురక్షితమైన, భద్రమైన, పోషణతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు శ్రీజన. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ సరైన సంరక్షణ లేకపోతే, కార్మిక శిబిరాల్లోని పిల్లలు దోపిడీకి , మాదకద్రవ్యాల దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు.
కార్మిక శిబిరాలకు నేరుగా విద్యను అందించే సహకార ప్రయత్నంలో భాగంగా, నిర్మాణ కార్మికుల పిల్లల కోసం సైబరాబాద్‌లోని నర్సింగిలో మొట్టమొదటి కార్యక్షేత్ర పాఠశాలను ప్రారంభించారు. సరైన సంరక్షణ లేకపోతే, కార్మిక శిబిరాల్లోని పిల్లలు దోపిడీకి , మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి గురయ్యే ప్రమాదం ఉంది అని అన్నారు. ప్రభుత్వ విభాగాలు, ప్రైవేట్ సంస్థలు, ఎన్జీఓల మధ్య సమన్వయ ప్రయత్నాల ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. పిల్లలకు వారి మాతృ భాషలో బోధించడం వల్ల అభ్యసన ఫలితాలు మెరుగు పడతాయని పేర్కొన్నారు. జి. శ్రీజన మాట్లాడుతూ ఈ కార్యక్రమం శాశ్వతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజపుష్ప వ్యవస్థాపకురాలు పుష్పలిల మాట్లాడుతూ, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 58 మంది పిల్లలు ఈ శిబిరంలో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.
The post వలస కార్మికుల పిల్లల కోసం ఇంటి వద్దకే విద్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
