అమరావతి : గేట్స్ ఫౌండేషన్, టాటా సంజీవనితో కలిసి ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలు చేస్తున్నామన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా డిజి హెల్త్ కేర్ అమలు చేస్తున్నామన్నారు. రాజధానిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన చేశామని, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెలిసిటీ సెంటర్ ప్రారంభించడం జరిగిందన్నారు. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియాకు శంకుస్థాపన..రెండేళ్లలో గ్రీన్ అమోనియ ఎగుమతి అవుతుందని తెలిపారు. రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ చేశామని, 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పొగాకు, మామిడి, కోకో, ఉల్లి పంటలకు రూ.1,100 కోట్లు చెల్లించినట్లు తెలిపారు సీఎం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతం పెరిగిందన్నారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చామని, నాలా చట్టం, ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు.
విద్యా వ్యవస్థలో పెనుమార్పులు తీసుకు వచ్చాన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాల సాధన – ముస్తాబు వంటి వినూత్న కార్యక్రమాలు అమలు చేశామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్, పారదర్శకంగా బదిలీలు చేపట్టామ్నారు. విద్యుత్ రంగం గాడిన పడిందని, ట్రూ డౌన్ కు అంకురార్పణ చేశామన్నారు. యూనిట్ కాస్ట్ 0.30 పైసలు తగ్గించామన్నారు. ఈవీలకు ప్రోత్సాహం -వాహనాలకు గ్రీన్ టాక్స్ తగ్గింపు, 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేశామన్నారు. సోలార్ రూఫ్ టాప్ లో బీసీలకు రూ.20 వేల అదనపు సాయం చేసినట్లు తెలిపారు సీఎం.
The post ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
