అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో నేడు పదో తరగతి ఫలితాల విడుదలకు అధికారులు ఏర్పాట్టు పూర్తి చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నాడు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు reults. bse. ap,gov.in వెబ్ సైట్లలో ఫలితాలను పొందవచ్చని అధికారులు తెలిపారు.
కాగా, తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ ప్రాంగణంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 95.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4.97 లక్షల మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేడ్స్ మాత్రమే కాకుండా సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు.
ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం ఉత్తీర్ణత సాధించగా హైదరాబాద్‌లో అత్యల్పంగా 89.23 ఉత్తీర్ణత సాధించింది. 6 పాఠశాలల్లో 0 శాతం ఉత్తీర్ణత నమోదయింది. బాలికల్లో 96.26 శాతం ఉత్తీర్ణత, బాలురు 94.07 ఉత్తీర్ణత సాధించారు. మార్చి 14 నుంచి మే 13వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు.
