Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

IPL Matches | ఐపీఎల్‌ టికెట్ల అక్రమ దందా! హైదరాబాద్‌ తో జరిగే మ్యాచుల్లో కాంప్లిమెంటరీ పాస్‌ల బిజినెస్‌

Ai generated article, credit to orginal website, April 20, 2026

హైదరాబాద్‌ తో జరిగే మ్యాచుల్లో కాంప్లిమెంటరీ పాస్‌ల బిజినెస్‌
4వేల టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్న వైనం
ఆర్థిక వ్యవహారమంతా హెచ్‌సీఏ షాడో సెక్రటరీదే!
ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్వహణలోనూ ఎంపీ తమ్ముడిదే హవా!
చక్రం తిప్పుతున్న పోలీస్‌ అధికారి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లలో కాంప్లిమెంటరీ పాస్‌ల దందా జోరుగా సాగుతున్నది. స్టేడియం కెపాసిటీని బట్టి ఇచ్చే సుమారు 4వేల టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. ఈ పాస్‌ల పంపిణీ మొత్తాన్ని బిగ్‌ బ్రదర్‌ సూచనల మేరకు షాడో సీఎంగా చెలామణి అవుతున్న ఆ ‘రెడ్డి’ అంతా చూసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈయనకు తోడు కాంగ్రెస్‌ పార్టీకి అత్యంత అనుకూలంగా వార్తలు ప్రసారం చేసే ‘పెద్ద’ మీడియా సంస్థకు చెందిన వ్యక్తే.. హెచ్‌సీఏలో షాడో సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ కలిసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) నుంచి వచ్చే కాంప్లిమెంటరీ పాస్‌లను గంపగుత్తగా నచ్చిన వారికి, డబ్బులిచ్చిన వారికి ఇష్టారీతిన పంచుతున్నట్టు తెలిసింది.
సీఎం బాక్స్‌.. గవర్నర్‌ బాక్స్‌ టికెట్ల దందా!
ప్రతి ఐపీఎల్‌ మ్యాచ్‌కు హెచ్‌సీఏ నుంచి సీఎం బాక్స్‌కు 30, గవర్నర్‌ బాక్స్‌కు మరో 30 టికెట్లు వస్తాయి. వాటితోపాటు ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి కూడా ఆ రెండు బాక్స్‌లకు 50 చొప్పున 100 టికెట్లు ఇస్తున్నారు. వీటిని నేరుగా సీఎంవోకు పంపితే.. అక్కడినుంచి ఆ షాడో సీఎం చక్రం తిప్పుతున్నారు. రాజ్యసభ సభ్యుడి సోదరుడు ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌ నిర్వాహకుడిగా బాధ్యతలు చేపట్టడం, హెచ్‌సీఏ సెక్రటరీగా కాంగ్రెస్‌ నాయకుడు కొనసాగడం, ఓ మీడియా సంస్థకు చెందిన వ్యక్తిని మీడియా మేనేజర్‌గా నియమించడం, ఓ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పెత్తనం కలిసి హెచ్‌సీఏను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా స్టేడి యం భద్రతను పర్యవేక్షించే పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులకు, స్టేషన్ల సిబ్బందికి, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులకు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌ సిబ్బందికి కేటాయించే టికెట్లలో ఈ సారి షాడో సీఎం, షాడో సెక్రటరీ వల్ల భారీగా కోత పడినట్టు తెలుస్తున్నది. అక్రమంగా వి క్రయిస్తున్న వాటిలో వీఐపీ బాక్స్‌ టికెట్లు, ఇతర ఖరీదైన పాస్‌లు కూడా ఉన్నాయి. వీటి విలువ ఒకో సభ్యుడికి సుమారు రూ. 10-15 లక్షల వరకు ఉంటుందని అంచనా.
పాసుల పంపిణీలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారి
ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి వచ్చే 10శాతం టికెట్లు కాకుండా ప్రత్యేకించి పోలీసు విభాగానికి కొన్ని టికెట్లను ఎస్‌ఆర్‌హెచ్‌ కేటాయిస్తుంది. ఈ క్రమంలో తన పరిధికాని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి అధిక సంఖ్యలో టికెట్లు తీసుకెళ్తున్నట్టు స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఉప్పల్‌ పరిధిలోని పోలీసు స్టేషన్ల సిబ్బందికి సైతం ఇవ్వకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్వోలు సైతం మీడియాకు ఇచ్చే కాంప్లిమెంటరీ పాస్‌లను అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది.
ఐపీఎల్‌ టికెట్ల లెకలివే!
ఐపీఎల్‌ టికెట్లను కాంప్లిమెంటరీ కింద హెచ్‌సీఏకు ఎస్‌ఆర్‌హెచ్‌ 10 శాతం టికెట్లను కేటాయిస్తుంది. ఈ 3,900లో సుమారు 220 క్లబ్‌లలో ఒక్కో క్లబ్‌కు 12 చొప్పున టికెట్లు ఇస్తున్నారు. మిగిలిన వాటిల్లో అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు 9 మంది ఒక్కొక్కరు 70-100 వరకు తీసుకుంటున్నారు. హెచ్‌సీఏ ఉద్యోగు లు 100 మందికి 2 చొప్పున ఇస్తారు. వీటిలో మిగిలితే అంతర్జాతీయ, జాతీయ క్రికెటర్లు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోనే కాంగ్రెస్‌ పెద్దలు దందా షురూ చేశారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • ఆదివాసీల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న కేంద్రం
  • న‌టి అనన్య నాగళ్ల షాకింగ్ కామెంట్స్
  • పేద‌ల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు
  • సింహాచలం చందనోత్స‌వానికి భారీ ఏర్పాట్లు
  • ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes