Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Nepal Elections: “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా నేపాల్‌లో ఎన్నికలు..

Ai generated article, credit to orginal website, March 5, 2026

Nepal Elections: హింసాత్మక “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా హిమాలయ దేశం నేపాల్‌‌లో ఈరోజు ఎన్నికలు జరుగనున్నాయి. గతేడాది సెప్టెంబర్లో యువత ఆందోళన మధ్య అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఈ ఆందోళనల సమయంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది చనిపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. రెండు రోజుల నిరసనల్లో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్ రాజకీయ చరిత్రలో అత్యంత హింసాత్మక ఘటనల్లో ఒకటిగా ఈ ఆందోళనలు నిలిచాయి.
Read Also: Vijay Rashmika : తారాలోకం దిగివచ్చిన వేళ.. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాజకీయ, సినీ ప్రముఖుల సందడి!
మార్చి 5న జరుగుతున్న ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజలు రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. మొత్తం 3 కోట్ల నేపాల్ జనాభాలో 1.9 కోట్ల మంది ఓటర్లు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం 3 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. మొత్తం 275 పార్లమెంటరీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
పుష్ప కమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) [CPN (MC)], నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (యూనిఫైడ్-మార్క్సిస్ట్ లెనినిస్ట్) [CPN (UML)], షేర్ బహదూర్ దేవుబా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ (NC)లు మరోసారి ఎన్నికల బరిలో నిలబడ్డాయి. గత మూడున్నర దశాబ్ధాలుగా ఈ మూడు పార్టీలే నేపాల్‌లో అధికారాన్ని నిర్వహించాయి. అయితే, ప్రతీసారి ఏ ఒక్క పార్టీకి కూడా మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలే నేపాల్‌ను శాసించాయి. అయితే, ఈసారి ఈ పార్టీతో పాటు యువనేత, నేపాల్‌ రాజధాని ఖాట్మాండు మేయర్‌గా ఉన్న బాలెన్ షా కూడా ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గూగుల్ ఏఐ హబ్ తో మార‌నున్న విశాఖ ముఖ‌చిత్రం
  • గ్లోబ‌ల్ ఏఐ హబ్ గా విశాఖ‌ప‌ట్నం : సీఎం
  • ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంట‌ర్ కీల‌క పాత్ర‌
  • ద‌ర‌ఖాస్తు చేసుకుంటే చాలు ఇల్లు ఇస్తాం
  • ఉద్యోగాలకు నైపుణ్య, భాషా శిక్షణే కీలకం

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes