NTR | మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఒక్క సినిమాగా కాకుండా రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు ప్రశాంత్ నీల్ కథా పరిధి విస్తృతంగా ఉండటంతో సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలనే నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ కూడా రెండు పార్టులకు సంబంధించిన సన్నివేశాలతో ఏకకాలంలో జరుగుతోందని ప్రచారం.
ఈ వార్త నిజమైతే, ఎన్టీఆర్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అని చెప్పాలి. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగం విడుదల తేదీగా జూన్ 11, 2027ను మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసారు.. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజా రూమర్ ప్రకారం, రెండో భాగాన్ని కూడా అదే ఏడాది డిసెంబర్ 2027లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అంటే కేవలం ఆరు నెలల గ్యాప్‌లోనే రెండు భాగాలు విడుదల కావచ్చు. సాధారణంగా రెండు భాగాల మధ్య సంవత్సరాల గ్యాప్ ఉండటం మనం చూస్తుంటాం. కానీ ఇలా తక్కువ వ్యవధిలోనే రెండు పార్ట్స్ విడుదల చేయడం టాలీవుడ్‌లో అరుదైన విషయమే. ఇది నిజమైతే కొత్త ట్రెండ్‌కు నాంది పలికే అవకాశముంది.
ప్రశాంత్ నీల్ గత చిత్రాలు చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ కథనం, స్టైలిష్ మేకింగ్ అన్నీ కలిపి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించగలదని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు భాగాల వార్తపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఇవన్నీ రూమర్స్‌గానే భావించాలి. కానీ ఈ ప్రచారం మాత్రం సినీ వర్గాల్లో, అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
