Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

ఇంట్లోనే ఈత కొట్టేద్దాం..

Ai generated article, credit to orginal website, April 19, 2026

ఇల్లు కట్టే విధానం, డిజైన్లలో రోజురోజుకీ మార్పులు వస్తున్నాయి. కాస్తంత ఖర్చు ఎక్కువైనా సరే, కావాల్సినవన్నీ ఏర్పరచుకుంటున్నారు. కరోనా కాలం తర్వాత గృహ నిర్మాణంలో చాలా మార్పులే వచ్చాయి. వెనుక వరండాలోకి జిమ్‌ వచ్చింది. నట్టింట్లోకి స్విమ్మింగ్‌ పూల్‌ వచ్చేసింది. అయితే బయటి పూల్స్‌ అంత భారీ సైజులో కాకపోయినా, చిన్నగా ఫ్యామిలీ ఎంజాయ్‌ చేసేలా వీటిని నిర్మిస్తున్నారు. చెప్పాలంటే దీనికి స్థలం ఉంటే చాలు, పెద్దగా ఖర్చు కాదు. వీటిలో చాలారకాల డిజైన్స్‌ ఇంటిని అందంగా మారుస్తూ, కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయాన్ని పెంచుతాయి.
ఇంతకు ముందు ఇంట్లో స్విమ్మింగ్‌పూల్‌ సౌలభ్యం కేవలం బాగా డబ్బున్నవాళ్లకే సాధ్యం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఇంటీరియర్‌ డిజైనర్స్‌ క్రియేటివిటీతో చిన్నచిన్న అందమైన ఇండోర్‌ పూల్స్‌ తయారవుతున్నాయి. అలాగే మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే, బయటికెళ్లే వాకింగ్‌, జాగింగ్‌ చేయాలని లేదు. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక గంటపాటు స్విమ్మింగ్‌ చేసినా, శరీరానికి సరైన వ్యాయామం అందినట్లే. పైగా పిల్లలు కూడా ఆసక్తిగా పాల్గొంటారు. కాకపోతే బయటి వాతావరణాన్ని బట్టి నీళ్ల ఉష్ణోగ్రతను మార్చుకునే ఏర్పాట్లు మాత్రం కచ్చితంగా చేసుకోవాలి.
చిన్న స్థలం: స్విమ్మింగ్‌పూల్‌ కావాలనుకున్నంత మాత్రాన దానికోసం ఎక్కువ స్థలం కేటాయించాలేమోనన్న భయం అక్కర్లేదు. ఇంటి కాంపౌండ్‌లోని పెరట్లో వెడల్పాటి ట్యాంక్‌లాగా కట్టుకోవాలి. లేదంటే ఇంటికి ఒకవైపు ప్రహరీ గల్లీని పూల్‌గా మార్చొచ్చు. అలాగే ఇంట్లోనే ఒక గదిని పూర్తిగా కేటాయించినా, రకరకాల వాల్‌డిజైన్స్‌తో పూల్‌రూమ్‌ని అందంగా, ఆహ్లాదకరంగా మార్చొచ్చు. పైగా ఎలాంటి వాతావరణంలోనైనా హాయిగా ఈత కొట్టొచ్చు. ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు స్విమ్మింగ్‌పూల్‌లో కొంత ఆనంద సమయాన్ని గడపొచ్చు. ఫ్యామిలీ గెట్‌ టు గెదర్లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు.
రూఫ్‌టాప్‌ పూల్‌: చాలామంది ఓపెన్‌ పూల్‌ని ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్లు ఇంటి మిద్దె పైన స్విమ్మింగ్‌పూల్‌ని తయారు చేసుకోచ్చు. అప్పుడు పూల్‌ని ఎంత కావాలంటే అంతపెద్దగానూ కట్టుకోవచ్చు. మిద్దె మీద కాబట్టి పూల్‌ చుట్టూ మొక్కలు పెంచుకోవచ్చు. అంతేకాదు, పైన ఆకాశం, కింద నీళ్లు.. ఈ రెండింటి మధ్య ఈత కొడుతూ సమయాన్ని సంతోషంగా గడపొచ్చు.
వివిధ ఆకారాలు: స్విమ్మింగ్‌పూల్‌ అనగానే అది దీర్ఘచతురస్రాకారంలోనే ఉండక్కర్లేదు. నచ్చిన ఆకారంలో, పైగా ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుంటూ పూల్‌ని ఎలాగైనా కట్టుకోవచ్చు. కొందరికి వంకర్లు తిరిగిన పూల్‌ నచ్చితే, మరికొందరు వృత్తాకార పూల్‌ని ఇష్టపడతారు. ఇండోర్‌ పూల్స్‌ కాబట్టి నచ్చిన కలరింగ్‌ ఎఫెక్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. పూల్స్‌ చుట్టూ అద్దాల గోడలు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలున్న వాళ్లు వాళ్లకోసం ఎత్తుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. అంటే సగంవరకు తక్కువ ఎత్తులో పూల్‌ కట్టుకోవాలి.
గ్రౌండ్‌ఫ్లోర్‌ పూల్‌: మనసు ఉంటే మార్గముంటుంది అన్నట్లు, పూల్‌ పెట్టుకోవాలని అనుకున్నప్పుడు స్థలం దొరక్కుండా పోదు. ఉదాహరణకు ఇంటి గదుల్లో, మిద్ద్దె మీద స్థలం కుదరనప్పుడు స్విమ్మింగ్‌ పూల్‌ని అండర్‌గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే సెల్లార్‌తో పాటు, మెట్ల కింద స్థలంలోనూ స్విమ్మింగ్‌పూల్‌ కట్టించుకోవచ్చు. వీటివల్ల స్థలం వృథా కాకుండా పూల్‌ కూడా వచ్చేస్తుంది. పైగా సెల్లార్‌లో ఏర్పాటు చేసుకుంటే, రకరకాల లైటింగ్స్‌ పెట్టుకుని ఫ్యామిలీ టైమ్‌ గడపొచ్చు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • దుమ్ము రేపుతున్న లెనిన్ యెట్ట యెట్టా సాంగ్
  • మ‌హిళ‌ల హ‌క్కుల‌ను కాల‌రాసిన విప‌క్షాలు
  • స్వామి నాథ‌న్ జీవితం స్పూర్తి దాయ‌కం
  • అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి
  • ప్ర‌జారోగ్యానికి స‌మ‌స్య‌గా మారిన జ‌బ్బులు

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes