అమరావతి : ఏపీని ఎండలు మండుతున్నాయి. వడగాల్పుల దెబ్బకు జనం లబోమంటున్నారు. దీంతో కీలక ప్రకటన చేశారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ . 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎల్లుండి 07 తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, మందస, నందిగాం, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలలో వడగాలులు వీస్తాయన్నారు. విజయనగరం జిల్లా లోని బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, శృంగవరపుకోట, తెర్లాం, వంగర, వేపాడ, విజయనగరం రూరల్ మండలాలు ఎండకు గురవుతున్నాయన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా లోని బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, పోలవరం జిల్లా లోని గంగవరం, రంపచోడవరం, వరరామచంద్రా పురం, గుర్తేడు మండలాలు , అనకాపల్లి జిల్లా లోని బుచ్చయ్యపేట, దేవరపల్లి, కె.కోటపాడు, రావికమతం మండలాలు , కాకినాడ జిల్లా గండేపల్లి, జగ్గంపేట మండలాలు , తూర్పుగోదావరి : గోకవరం, కోరుకొండ మండలాలు ఎండ వేడిమి ప్రభావానికి గురవుతున్నాయి.
The post ఏపీలో వడగాడ్పుల మోత జనం విల విల appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
