బెంగళూరు : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. తాజాగా స్వంత గడ్డ బెంగళూరు వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో సత్తా చాటింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో టాప్ లోకి చేరుకుంది. గుజరాత్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది గుజరాత్ టైటాన్స్. ఆ జట్టుకు చెందిన సాయి సుదర్శన్ , కెప్టన్ శుభ్ మన్ గిల్ ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేశారు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది.
గుజరాత్ టైటాన్స్ కు చెందిన ఓపెనర్ సాయి సుదర్శన్ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తను 58 బంతులు ఎదుర్కొని 100 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. 3 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 206 రన్స్ టార్గెట్ నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చి పోయి ఆడారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సూపర్ షో చేశాడు. తను కంటిన్యూగా ఫుల్ ఫామ్ కొనసాగిస్తూ వస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో రెచ్చి పోయాడు. కేవలం 44 బంతులు ఎదుర్కొని 81 రన్స్ చేశాడు. 8 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. దేవదత్ పడిక్కల్ 27 బాల్స్ ఎదుర్కొని 55 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ 7వ స్థానానికి పడి పోయింది.
The post సాయి సుదర్శన్ సెంచరీ వృథా బెంగళూరు భళా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
