అహ్మదాబాద్ : ఐపీఎల్ 2026లో అజింక్యా రహానే సారథ్యంలోని కోల్ కతా నైట్ రైడర్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. పేలవమైన బ్యాటింగ్, బౌలింగ్ తో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి పాలైంది. కేవలం ఒకే ఒక్క పాయింట్ తో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉంది. ఇక ఇవాళ మరో కీలకమైన మ్యాచ్ కు వేదిక కాబోతోంది హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం. హైదరాబాద్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగింది కోల్ కతా నైట్ రైడర్స్ అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో. నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు మాత్రమే చేసింది.
అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది. ప్రధానంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ కీ రోల్ పోషించాడు. కెప్టెన్సీ ఇన్సింగ్స్ ఆడాడు. 181 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించారు. 5 వికెట్ల తేడాతో కోల్ కతాపై గ్రాండ్ విక్టరీ నమోదు చేశారు. 19.4 ఓవర్లతో పని కానిచ్చేశారు. స్కిప్పర్ గిల్ 50 బంతులు ఆడి 86 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. ఇక ఈ సీజన్ లో ఆశించిన మేర రాణించలేదు ఆసిస్ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్. కానీ గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ కీలక పోరులో దుమ్ము రేపాడు. 55 బంతులు ఎదుర్కొని 79 రన్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. దీంతో కోల్ కతా నైటా రైడర్స్ గౌరవ ప్రదమైన స్కోర్ చేసింది.
The post గిల్ షాన్ దార్.. గుజరాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విక్టరీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
