హైదరాబాద్ : మల్టీ టాలెంటెడ్ షెరాజ్ మెహదీ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. గతంలో విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ప్రేక్షకుల అభ్యర్థన మేరకు ఈ చిత్రాన్ని ఏప్రిల్ 24న రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడారు. అమ్మాయిలకు మోసాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ సబ్జెక్టు ఎంచుకున్నాను. ఈ సినిమా గ్లామర్‌పై ఆధారపడినది కాదు. మంచి కథా వస్తువుతో రూపొందిన వుమెన్ ఓరియెంటెడ్ చిత్రం. సమాజంలో అమాయక మహిళలు ఎలా మోస పోతున్నారో చూపించడంతో పాటు, అలాంటి మోసాలకు పాల్పడే వారికి తగిన శిక్ష తప్పదనే సందేశాన్ని కూడా అందిస్తున్నాం. గతంలో ఈ సినిమాను మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్లకు వచ్చి చూడాలని కోరుతున్నాను అని తెలిపారు.
ఈ చిత్రం కన్నడలో ‘ఓ సుందర రాక్షసి’ పేరుతో విడుదలై అక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. చిత్రంలో విహాన్షి హెగాడే, కృతి వర్మ, నేహా దేశపాండే, తమ్మారెడ్డి భరద్వాజ్, సుమన్ తల్వార్, షెరాజ్ మెహదీ, , అనంత్ బాబు, ప్రియా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షెరాజ్ మెహదీ సంగీతాన్ని కూడా అందించడం విశేషం . అమ్మాయిలపై వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉండాలి? మహిళల జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే సామాజిక అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని షెరాజ్ మెహదీ ప్రభావవంతంగా తెరకెక్కించారు. స్కై ఈజ్ ది లిమిట్ బ్యానర్‌పై సురీందర్ కౌర్ నిర్మాతగా, తేజిందర్ కౌర్ సహ నిర్మాతగా, షేర్ సమర్పణలో ఈ చిత్రం నిర్మితమైంది.
The post 24న ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
