Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Vijay TVK Party | విజయ్‌ బొమ్మ హిట్టా, ఫట్టా?.. రెండు బలమైన కూటములను టీవీకే ఢీకొట్టగలదా?

Ai generated article, credit to orginal website, March 25, 2026

Vijay TVK Party | చెన్నై, మార్చి 24: సినీ నటుడు విజయ్‌ వచ్చే నెలలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ అరంగేట్రం చేస్తుండడంతో తమిళనాడులో సినిమాకు, రాజకీయాలకు మధ్య ఉన్న చిరకాల అనుబంధం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్‌ 23న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనున్నది. పోటీ ప్రధానంగా ఏఐఏడీఎంకే, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ.. డీఎంకే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని సెక్యులర్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ మధ్యే ఉంది. విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఈ రెండు కూటములకు అవతల ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. తమిళనాడులో ఆరు దశాబ్దాలుగా ద్రవిడ ఆధిపత్యం తర్వాత విజయ్‌ రంగ ప్రవేశం చేస్తున్నారు. ప్రస్తుత పాలనా విధానంతో విసిగిపోయిన ఓటర్లను ఆకట్టుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
వారిపైనే విజయావకాశాలు..
సినీ దిగ్గజాలు ప్రజల మన్ననలు పొందిన రాజకీయ నేతలుగా మారిన సుదీర్ఘ సంప్రదాయం తమిళనాడులో కొనసాగుతున్నది. అదే సంప్రదాయం నుంచి విజయ్‌ రాజకీయ ప్రవేశం స్ఫూర్తి పొందింది. ఎంజీ రామచంద్రన్‌, జే జయలలిత వంటి సినీ దిగ్గజాలు రాజకీయాల్లో సైతం ఉన్నత శిఖరాలు చేరుకుని ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రను వేసుకున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ వాతావరణం మరింత విచ్ఛిన్నంగా, పోటీతత్వంతో కూడుకుని ఉంది. గతంలో రెండు భిన్న సిద్ధాంతాలు తమిళనాడు రాజకీయాలను శాసించగా ఇప్పుడు బహుళ కూటములు, దూకుడుగా వ్యవహరించే ప్రాంతీయ శక్తులు, రాజకీయ చైతన్యం నిండిన ఓటర్లు ఉన్నారు. ఇవన్నీ విజయ్‌ మార్గాన్ని సంక్లిష్టంగా మారుస్తున్నాయి. విజయ్‌ విజయావకాశాలన్నీ ఆయన అభిమానులపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు ఆయన విజయావకాశాలను నిర్దేశిస్తారు. తమిళనాడులో 2.89 కోట్ల మంది మహిళా ఓటర్లు, 2.77 కోట్ల మంది పురుష ఓటర్లు ఉన్నారని అంచనా. సినిమాల్లో అవినీతి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా నటించిన విజయ్‌ తన ప్రభావం చూపడానికి అధికారాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. తమిళనాడులోని రెండు ప్రధాన ద్రవిడ పార్టీల పట్ల నిరాశ చెందిన యువ, పట్టణ, వ్యతిరేక భావాలున్న ఓటర్లను తన వైపునకు తిప్పుకుంటే చాలు.. ఆయనే విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా మారిపోతారు.
టీవీకే కార్యాచరణ
ప్రభుత్వ వ్యతిరేక వాదాన్ని బలోపేతం చేసేందుకు ఎన్నికల్లో టీవీకే కొత్త ముఖాలను, సంప్రదాయేతర అభ్యర్థులను బరిలోకి దించడంపై దృష్టి సారిస్తున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. అంతేగాక అభిమానులతో కూడిన నెట్‌వర్క్‌ను బూత్‌ స్థాయి యంత్రాంగంగా మార్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నాలు విజయవంతమైతే పార్టీని అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లడంలో విజయ్‌ కృషి ఫలించినట్లే. అయితే ఇందులోనూ కొన్ని సవాళ్లు ఉన్నాయి. టీవీకే అభ్యర్థుల్లో దాదాపు అందరూ కొత్త ముఖాలే. అంతేగాక బూత్‌ స్థాయి యంత్రాంగం కూడా ఇప్పటివరకు ఏ ఎన్నికను ఎదుర్కొని ఉండదు. ఈ సమస్యలను అధిగమించేందుకు విజయ్‌ కూడా తన పార్టీ తరఫున నిలబడే ప్రతి అభ్యర్థిలో తననే చూడాలని, మొత్తం 234 మంది విజయ్‌లు బరిలో ఉన్నట్లు భావించాలని తన అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. అయితే దశాబ్దాలుగా పటిష్టమైన సంస్థాగత వ్యవస్థలను నిర్మించుకున్న డీఎంకే, అన్నా డీఎంకేలను విజయ్‌ టీవీకే ఎలా ఢీకొనగలదన్నది ప్రధాన సమస్య. అంతేగాక ఒంటరిగా బరిలోకి దిగుతున్న టీవీకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి అంతిమంగా అధికార కూటమికే లాభం చేకూర్చగలదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏ కూటమి మద్దతు లేకుండా సొంతంగా విజయ్‌ పార్టీ ఎన్ని సీట్లు గెలవగలదన్న చర్చ కూడా జరుగుతున్నది. 2026 ఎన్నికలు విజయ్‌కు నేరుగా కింగ్‌మేకర్‌ స్థాయిని కట్టబెట్టకపోవచ్చు కాని విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల విశ్వాసం ఏ మేరకు లభించగలదో మాత్రం ఈ ఎన్నికలు నిరూపిస్తాయి. బలమైన సంస్థాగత పునాదులు ఉన్న రెండు బలమైన కూటములను సినీ గ్లామర్‌ ఏ మేరకు ఢీకొనగలదో వేచి చూడాల్సిందే.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • గిల్ షాన్ దార్.. గుజ‌రాత్ టైటాన్స్ హ్యాట్రిక్ విక్ట‌రీ
  • ఇది భార‌త‌దేశ ప్ర‌జ‌ల విజ‌యం : ష‌ర్మిలా రెడ్డి
  • 24న ‘ఓ అందాల రాక్షసి’ సినిమా రీ-రిలీజ్
  • ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ
  • బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

Recent Comments

No comments to show.

Archives

  • April 2026
  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes