హైదరాబాద్ : ఢిల్లీలో(Delhi) ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ పేలి పోవడంతో(AC blast) నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ప్రమాదవశాత్తు ఏయిర్ కండీషనర్ పేలిపోయి మంటలు అలుముకున్నాయి.
ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మరికొందరు గయాపడగా స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండున్నర గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాలు తెలయాల్సిఉంది.
