ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు. అందులో అందరినీ ఊరిస్తున్న ప్రాజెక్ట్ ‘రాకా’. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో, సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా అట్లీ సినిమాలు అంటే భారీ మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. దీనివల్ల ఈ సినిమా 2027లో రావడం కష్టమని కొందరు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదలపై అట్లీ ఒక పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
Also Read : Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ కోసం నెట్‌ఫ్లిక్స్ మైండ్ బ్లోయింగ్ ఆఫర్!
అల్లు అర్జున్ తన పోర్షన్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయబోతుండటంతో, 2027 సెకండ్ హాఫ్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని టీమ్ భావిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ల లిస్ట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనే, ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ఈ నలుగురు అగ్ర కథానాయికలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఇంతమంది స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో ఉంటే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. అల్లు అర్జున్ సరసన వీరందరి రోల్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు అతిపెద్ద సస్పెన్స్. దీంతో ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని కొందరు, కాదు పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
